సొంత మరిదితో వివాహేతర సంబంధం... 14 ఏళ్లలోభర్తతో పాటు ఒకే కుటుంబంలో ఆరుగుర్ని చంపిన కోడలు జోలీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేరళలో... ఆస్తి కోసం ఈ హత్యలు చేసిన జోలీ వివాహేతర సంబంధం పెట్టుకున్న షాజూని కూడా మోసం చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో పనిచేస్తున్నానని చెప్పిందని... కానీ ఆమె నిట్‌లో ఏ ఉద్యోగమూ చెయ్యట్లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. జరిగిన ఆరు హత్యలకూ తనకూ సంబంధం లేదంటున్న షాజూ... జోలీకి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వచ్చేవని పోలీసులకు తెలిపాడు.

జోలీ ఇకపై జైలు జీవితానికే పరిమితం అవుతుంది కాబట్టి... ఆమె ఇద్దరు పిల్లల్నీ తాను చూసుకుంటానంటున్నాడు షాజూ. ఐతే... జోలీ... మీ భార్యను, కూతుర్ని కూడా చంపేసింది కదా...అని  ప్రశ్నించగా... తాను బాధల్లో ఉన్నానని షాజూ తెలిపాడు. కేరళలోని కూడతాయిలో పొన్నమట్టం కుటుంబానికి చెందిన అన్నమ్మ థామస్, టామ్ థామస్ అనే దంపతులకు రాయ్ థామస్,మోజో అని ఇద్దరు కొడుకులున్నారు. 14 ఏళ్ల కిందటరాయ్ థామస్‌ ని పెళ్లి చేసుకున్న  జోలీ.... రాయ్ థామస్ పెద్దనాన్న కొడుకు షాజూతో జోలీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. షాజూ ఆస్తులతోపాటూ... తన భర్త కుటుంబానికి చెందిన ఆస్తిని దక్కించుకోవాలని భర్త కుటుంబ సభ్యులతో పాటు షాజూ భార్య, కూతుర్ని కూడా చంపేసింది.

2002లో అత్త అన్మమ్మ, 2008లో మామ టామ్ థామస్, 2011లో భర్త రాయ్ థామస్, 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ... 2016లో షాజూ భార్య సిలీ, అతడి కుమార్తె అల్ఫోన్సా చనిపోయారు.ఈ హత్యలన్నీ సహజ మరణాలుగా అంతా భావించారు. ఐతే... హత్యలు జరుగుతున్న ఏళ్లలోనే... ఆస్తులన్నీ జోలీ పేరు మీదకి మారిపోయాయి. ఈ వరుస మరణాలపై ఆమె మొదటి భర్త సోదరుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాంతో అవన్నీ హత్యలేనని తేలింది.జోలీ ఒక్కతే సైనేడ్ ఇచ్చి వారిని చంపినట్లు తేల్చారు. 

దర్యాప్తులో భాగంగా మృతి చెందిన కుటుంబ సభ్యుల సమాధుల్ని తవ్వి తీసి అటాప్సీ జరిపగా.. రిపోర్టుల్లో సైనేడ్ వల్లే వాళ్లంతా చనిపోయినట్లు తేలింది. ఆస్తి కోసం మామ టామ్ థామస్‌పై ఒత్తిడి తెచ్చిన జోలీ... భర్తతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యుల్నీ ఒక్కొక్కరిగా చంపేసినట్టు పోలీసులు తేల్చారు. శనివారం ఉదయం 10 గంటలకు జోలీని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: