టిక్‌టాక్‌ వీడియోలో పెద్ద విలన్‌లాగా ఫేమస్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన  అశ్వినీ కుమార్ (30) తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జానీ దాదా చెప్పుకునే ఇతను బర్హాపూర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున తనను తాను కాల్చుకుని చనిపోయాడు.  టిక్ టాక్ వీడియోల్లో ‘విలన్‌’ వేషాలేసిన అశ్వినికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కానీ... తాజాగా 3 హత్యకేసుల్లో మాత్రం అతను అనుమానితుడుగా మారాడు. ‘

అతడి ఆచూకీ కోసం లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు.‘నేను అన్నిటినీ నాశనం చేసేస్తా’, ‘దయ్యం ఇప్పుడు రెడీగా ఉంది’, ‘నే సృష్టించే విలయం చూడండి’ అంటూ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లూ చేస్తూండేవాడు. స్థానిక బీజేపీ నేత కుమారుడు, అతని మేనల్లుడిని హత్య చేసిన కేసులో అశ్వినీ కుమార్ నిందితుడు.   అతడి తలపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. 
అలాగే తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన కారణంతో ఒక యువతిపై పై బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశాడు.


దీంతో గత వారం రోజులుగా పోలీసులు అశ్వనిి కుమార్ కోసం గాలిస్తున్నారు. దీంతో భయపడి ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అశ్విని ఎక్కే బస్సును గుర్తించిన పోలీసులు దాన్ని అడ్డగించారు. 
దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన అశ్విని తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని  చనిపోయాడని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) విశ్వజీత్ శ్రీవాస్తవ తెలిపారు.
అంతేకాదు అతను ఎపుడూ ఒక పిస్తోల్‌ను, రెండు మ్యాగజైన్స్ (బుల్లెట్ల)  14 పేజీల నోటును వెంట తీసుకెళ్తాడట. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అశ్విని గ్రాడ్యుయేట్ చదివాడు. ఇతని తండ్రి చెరకు సహకార సంఘంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సోదరుడు డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేటు సంస్థలో పనిచేసిన అశ్విన్ కొద్దికాలం తర్వాత ఆ ఉద్యోగం వదిలేశాడు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: