దేశంలోని అత్యంత దానశీలుడిగా HCL టెక్నాలజీస్ చైర్మన్ శివనడార్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ, మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. 2019 సంవత్సరానికి గాను ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా సంయుక్తంగా జాబితాను రూపొందించాయి. ఈ జాబితాలో శివనాడార్, ఆయన ఫ్యామిలీ దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చిన విరాళం.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నవారి విరాళంతో కలుపుకుంటే దాదాపు సమానంగా ఉంది.

టాప్ 3..
శివనాడార్, ప్రేమ్ జీ, ముఖేష్ ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా ప్రకారం శివనాడార్, ఆయన ఫ్యామిలీ రూ.826 కోట్లు విరాళంగా ఇచ్చింది. అజీమ్ ప్రేమ్ జీ రూ.453 కోట్లతో రెండో స్థానంలో, ముఖేష్ అంబానీ రూ.402 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ దాతృత్వ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.

టాప్ 100లో టాప్ 10 వాటా 63 శాతం....
వ్యక్తిగతంగా, కార్పోరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన వందమంది జాబితాను రూపొందించారు. జాబితాలోని 100 మంది మొత్తంగా ఇచ్చిన విరాళం రూ.4,391 కోట్లు. ఇందులో మొదటి పదిమంది వాటా 63 శాతంగా ఉండటం గమనార్హం.

90 శాతం పెరిగిన విరాళం...
2018 ఏడాదితో పోలిస్తే జాబితాలో విరాళాల మొత్తం 90 శాతం పెరిగింది. 2018లో రూ.2,310 కోట్లు విరాళం ఇవ్వగా, ఈ ఏడాది రూ.4,391కు పెరిగింది. అలాగే, రూ.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వారి సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 38 మంది నుంచి 72కు చేరుకుంది.


విద్య కోసం ఎక్కువగా విరాళం విరాళం...

ఇచ్చిన వారిలో కూడా విద్య కోసం ఎక్కువగా ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చారు. విద్య కోసం 59 మంది, ఆరోగ్య సంరక్షణ కోసం 53 మంది, కళలు, సంస్కృతి, వారసత్వం కోసం 18 మంది విరాళం ఇచ్చారు. మతపరమైన విరాళాలు కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం రూ.10 కోట్ల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భారతీయుల సంఖ్య 2018లో 38 ఉండగా, 2019లో 72కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: