విశాఖపట్నంకు చెందిన చెందిన ప్రశాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు బెంగళూరులోప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌ కొలిస్థాన్‌ ఎడారిలో వీరిని సోమవారం అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్‌ మీడియా తెలిపింది. ప్రశాంత్‌ తోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది.


హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఓ యువతి కోసం వెతుక్కుంటూ.. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించాడని, కొంత మంది మాత్రం ప్రశాంత్‌ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్వప్నిక పరిచయం అయిందని, కానీ ప్రశాంత మాత్రం పాక్ కి ఎందుకు వెళ్ళాడో తెలియదన్నారు యువకుడి కుటుంబ సభ్యులు. కాగా, ప్రేమ విఫలం చెందటంతో గత రెండేళ్లుగా ప్రశాంత్ పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాడని, మతిస్థిమితం కోల్పోయాడని అతని తండ్రి వాపోయారు. కాగా, అసలు అతడు రెండేళ్ల క్రితమే పాక్‌ భూభాగంలోకి అడుగు పెట్టాడని.. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్‌.. అటూఇటూ తిరుగుతూ.. ఎడారి మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.


ప్రస్తుతం అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్‌ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ సాఫ్ట్ వేర్ కావటంతో, వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారనే అభియోగాలు పాకిస్థాన్‌ మీడియాలో ప్రసారమవుతున్నాయి. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారని పాక్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసలు ప్రశాంత్ ఎవరనే కోణంలో వారు విచారణ ప్రారంభించారు. తమ కుమారుడికి నేరాలు చేసే స్వభావం లేదని, ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రశాంత్ ను క్షేమంగా భారత్ కు తీసుకురావాలని ఆయన వేడుకుంటున్నాడు. ప్రశాంత్ మాట్లాడిన వీడియోను పాక్ పోలీసులు ట్విట్టర్ లో పెట్టారు.

 

గత రెండేళ్లుగా పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాడని, మతిస్థిమితం కోల్పోయాడని కూడా అతని తండ్రి వాపోయారు. ఈ మేరకు మంగళవారం మదాపూర్‌ పోలీసులకు బాబురావు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తన కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ప్రశాంత్‌ తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్‌చల్‌ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. పాక్‌ నుంచి యూరప్‌ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పలు కథనాలను ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: