Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:55 pm IST

Menu &Sections

Search

బురద నీరే, వీరి తాగునీరు...

బురద నీరే, వీరి తాగునీరు...
బురద నీరే, వీరి తాగునీరు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో గొత్తికోయలకు గుంపులుగా జీవిస్తున్నారు. వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి బతుకుదెరువు కోసం నాలుగు దశాబ్దాల క్రితమే వలస వచ్చారు. వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకొని, హైదరాబాద్‌కి చెందిన యువ డాక్టర్‌ నరేందర్‌ రెండేళ్ల క్రితం వారి మధ్యకు చేరుకున్నాడు. చదువుకు దూరమైన గొత్తికోయ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించి, వారికి అండగా నిలిచాడు.ప నెలలో సగం రోజులు అడవిలోనే ఉంటూ గొత్తికోయల బాగోగులు చూస్తూ, వైద్య సేవలు అందిస్తూ వారిలో ఒకరిగా మారాడు. 

మహిళల్లో రక్తహీనత ఈ ప్రాంతంలోని పది గ్రామాలకు చెందిన 35 మంది మహిళలకు డాక్టర్‌ నరేందర్‌ వైద్యపరీక్షలు చేయగా వారిలో 33 మందికి రక్తహీనత ఉందని నిర్ధరణ అయింది. అనేక మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో కనిపిస్తున్నారు. రక్తహీనత బారిన పడుతున్నారు. ముఖాలు పాలిపోయి, బక్కచిక్కి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన సొంత ఖర్చుతో వారందరికీ, గోధుమలు,జొన్నలు,పల్లీ పిండితో చేసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు.
 బురద నీరే, తాగునీరు
వలస వచ్చిన వీరు విద్య, వైద్యం, రవాణా, పౌష్టికాహా రానికి ఆమడ దూరంలో ఉన్నారు. గొత్తికోయలు అనారోగ్యానికి గురైతే ఆకుపసర్లే దిక్కు.రోగం మరీ ఎక్కువైతే నాటు వైద్యులను సంప్రదిస్తారు.
మహిళలు ఇంటివద్దనే పురుడు పోసుకుంటారు. పాము, తేలు కుట్టినా వారు నాటు వైద్యంతోనే సర్దుకుంటారు. ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో వీరు నాటు వైద్యాన్నే నమ్ముకున్నారు. వీరికి మిషన్‌ భగీరథ లాంటి పథకాల గురించి తెలీదు. తాగునీటి సౌకర్యం లేదు. బోర్లు లేవు. వాగుల్లో, నీటి గుంటల్లో నీరే వీరికి తాగునీరు .దాంతో రోగాల పాలవుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో డాక్టర్‌ నరేందర్‌ తన బృందంతో వీరికి అండగా నిలిచి తగిన వైద్యాన్ని అందిస్తున్నారు. 

అడవి ఒడిలో స్వేచ్ఛగా బతికే వీరు జనారణ్యంలోకి రావడానికి ఇష్టపడరు. వారికి వాగులు, వంకల్లో చెలిమెలనే ఆధారం. అటవీ ప్రాంతంలో సమీప వాగుల్లో స్నానాలు చేసి బట్టలు శుభ్రం చేసుకుని తాగు నీరు తెచ్చుకుంటారు. అయితే వాగుల్లో నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. వీరంతా మనవారే. కానీ, కానివారుగా బతుకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సమాజం చొరవచూపి విద్య, వైద్యం, ఉపాధి కల్పించి, వీరిని ఆదుకోవాలని డాక్డర్‌ నరేందర్‌ అన్నారు.

 స్పందించిన అధికారి... 

గొత్తి కోయలు ఎదుర్కొంటున్న సమస్యలను భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ వి.పి .గౌతం గారి దృష్టికి ఈ జర్నలిస్టు తీసుకెళ్లగా, ఇలా అన్నారు.
 '' గొత్తి కోయల సమస్యలకు సమగ్ర మైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. వారిలో కొందరికి ఆధార్‌ కార్డులు, ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఇచ్చాం. మిగతా వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తాగునీరు, వైద్యం అందిస్తాం...'' అన్నారు. 


no-water
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారా జగన్‌ గారూ?
చుక్కేయాలంటే ఇక 'చుక్కలు' కనిపిస్తాయి.
మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే?
పొలం నుండి పార్లమెంట్‌కు...
యంగెస్ట్‌ ఎంపీ, గిరిజన యువతి
 '' గెలిచినా,ఓడినా మంగళగిరే నా ఇల్లు ''
బాబు పాలనలో 2 లక్షల 57వేల కోట్ల అప్పులు
ఎదురు తిరిగిన దత్తత గ్రామాలు..?
విధి చేయు వింతలెన్నో...
జగన్‌కి, రత్నప్రభ అభినందనలు
కారు దగ్గరకొచ్చి....అక్కున చేర్చుకొని ...
ఎపీలో ముచ్చటగా 30 జిల్లాలు ...?
 ఇదొక మానవీయ విజయం
    రాజుల రోజులు పోయాయి ...
జగన్‌కి అండగా కొండ జనం...
జగన్‌కి టాలీవుడ్‌ జేజేలు...
'' ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చారు''
జగన్‌ విజయ రహస్యం ఇదే .?
విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా.
ఆమెది గోల్డెన్‌ లెగ్‌...
అహంకారం పై ప్రజా విజయం
జనసేన అసెంబ్లీలోకి అడుగు పెడుతుందా?
అన్ని లోక్‌సభ స్ధానాల్లో వైసీపీ ప్రభంజనం?
జగన్‌ ముందున్న లక్ష్యం అదే..
తెలంగాణలో బీజేపీ హల్‌ చెల్‌
ప్రభుత్వం పై ప్రజల గెలుపు...
ఎదురీతలో మంత్రులు...?
చిత్తూరు జిల్లాలో టీడీపీ చిత్తు
విజయోత్సవం మొదలైంది..
హిందూపురంలో గోరంట్ల మాధవ్‌ ఆధిక్యంలో
మా గెలుపును ఎవరూ ఆపలేరు
లైవ్‌ నిరాహార దీక్షలో ' మోజో ' టీవీ సిఇఓ...?
'భారత్‌ దర్శన్‌' లాంటి మరో రైలు.
హేమమాలిని తరువాత సత్యప్రభ ?
వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదు : ఈసీ
మీ పెదవులు పదిలం?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.