poetry
 మెదక్‌ జిల్లా, ఎస్‌పీ చందన దీప్తికి రైతన్నల కష్టాల మీద అంతులేని ఆవేదన...నిరంతరం మట్టిలో బతుకుతూ ,
స్వేదంలో సేద్యం చేస్తూ, మన్ను నుండి మనకు అన్నం తెస్తున్న కర్షకుల కన్నీటి మీద ఒక కవితను రాశారు...
చదవండి..
'' అతని చేతులు నేలను నిమిరి రక్తమోడుతున్నాయి... 
అయినా అతడు రాజే. 
అతని అరికాళ్ళు పుండ్లవుతున్నాయి... అయినా అతడు రాజే.
అతని శరీరంపై చీడ పురుగులు నాట్యం చేస్తున్నాయి... అయినా అతడు రాజే.
అతనికి కాలం కలిసిరాక కరువే విషమై కాటేస్తుంది... అయినా అతడు రాజే. అవును అయినా అతను రాజే. ఎందుకంటే... 
అతని నెత్తిన చెమటనే కిరీటం ఉంది. అతని శరీరం మొత్తం పచ్చదనం అనే బంగారం పరుచుకుని ఉంది. 
అతడు నమ్ముకున్న నేలే అతన్ని నడిపిస్తుంది. అతడే రైతు...రైతే రారాజు. ఆ రారాజు ఇప్పుడు అప్పుల కొలిమిలో ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యి..

అన్నం పెట్టిన చేత్తో దండం పెడుతూ ఆకాశంవైపు దేహి అంటూ ఆబగా చూస్తున్నాడు. 
నెత్తుటి సంతకాల సంతాపాల్లో, కత్తులుదూసిన నేలలో... 
నకిలీ విత్తులు కొనలేక సాటి మనిషి వైపు నిస్సహాయంగా న్యాయం చేయమని చేయి చాస్తున్నాడు.
అలాంటి రారాజుని నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నవారిని ఏం చెయ్యాలి?? 


మరింత సమాచారం తెలుసుకోండి: