స్వేదం చిందిస్తూ , సాగుబడి లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులను అవార్డులతో సత్కరించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలనేది ' గ్లోబల్‌ యాక్సిస్‌ కమ్యూనికేషన్‌ నెట్‌ వర్క్‌ ' కార్యక్రమ లక్ష్యం. ఈ అవార్డుల కార్యక్రమానికి, మీడియా పార్టనర్‌గా 'రూరల్‌మీడియా' వ్యవహరిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో బహుళపంటలు, సేంద్రియ సాగు, సూక్ష్మసేద్యం, కరవు ప్రాంతంలో చిరుధాన్యాల సాగులో విజయం సాధించిన రైతులు తమ విజయ ప్రస్ధానం మాకు పంపండి.

అవార్డుల ఎంపిక ఇలా...

 మీ వివరాలు మాకు అందిన వెంటనే మా ప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి, మీ సాగు విధానం పరిశీలించి, మీ విజయగాధను రిపోర్టు చేసి, అవార్డుల కమిటీకి అందచేస్తారు. అవార్డులు పొందిన రైతులను మా స్వంత ఖర్చులతో హైదరాబాద్‌ ఆహ్వానించి, ప్రముఖుల సమక్షంలో సత్కరిస్తాం.

తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించి, సాగులో మరిన్ని ప్రయోగాలు చేసి దిగుబడులు పెంచేలా స్ఫూర్తినివ్వడం కోసమే, '' భూమి పుత్ర అవార్డులు '' .

జర్నలిస్టులకు అవార్డులు 

వ్యవసాయంలో విజయవంతమైన రైతుల కథనాలను రిపోర్ట్‌ చేస్తున్న పాత్రికేయులకు కూడా 3 అవార్డులు( ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, వెబ్‌ మీడియా) ఉన్నాయి. మీ కథనాలు 2018 జనవరి నుండి 2019 మే నెలలోపు ప్రచురించి ... ప్రసారం చేసి ఉండాలి. 

ఎన్జీఓలకు అవార్డులు 

వైవిధ్యమైన పంటల సాగులో పేద రైతులను ప్రోత్సహిస్తూ, వారిని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్ధలను అవార్డులతో సత్కరించ బోతున్నాం.

మీ పూర్తి వివరాలు ఈ కింది ఎడ్రస్‌కి పంపండి. 

 Global Axis communication network, plot no 9 flat 201,

Binduvilla near lotuspond,  road no12, Banjarahills,

Hyderabad 500034 email shareeff433@gmail.com what's app no. 9441027989

అవార్డుల కొరకు మీ వివరాలు మాకు అందాల్సిన ఆఖరు తేదీ 16.7.2019 .

ఈ అవార్డుల గురించి మరిన్ని వివరాలకు ఈ నెంబర్‌( 9441027989,9441327504)లో కాంటాక్టు చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: