మన దేశంలో ఎవరికీ సమస్య ఉన్న లేకపోయినా నిత్యం సమస్యలతో అల్లాడిపోయేది ఒక్క రైతు మాత్రమే. ప్రభుత్వాలు రైతులకు కోసం ఎన్ని పధకాలు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఫలితం లేకుండా పోతుంది. ఫలితం పక్కన పెడితే రైతు కనీసం బతికే పరిస్థితి కనిపించడం లేదు . ఒక ఇంటర్ నేషనల్ సర్వే ప్రకారం ఇండియా లో రైతుల ఆత్మహత్యల ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయని చెబుతుంది. భారతదేశ  ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలతో పటు రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతుంటే దానిని నిజమైన వృద్ధి అని చెప్పుకోగలమా ?


భారత దేశ అర్దిక వ్యవస్థ పెరుగుతునప్పుడు రైతులకు లాభం ఎందుకు చేకూరటం లేదని అందరికి సందేహం రావొచ్చు. ఇక్కడే పాలకులు చేస్తున్న తప్పులు మనం చెప్పుకోవాలి. రైతులకు మేలు జరగాలంటే ఏం చేయాలో ఇప్పటికే ఆర్ధిక వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. కానీ పాలకులు వాటిని చిత్త శుద్దితో అమలు పరిచే ఉద్దేశం లేదు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే వృద్ధి రేటు కనీసం 6 % ఉండాలని స్వామినాథన్ కమిటీ నివేదించింది. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. 


రైతులకు గిట్టుబాటు ధర కలిపించాలంటే పండిన పంటను స్టోర్ చేసుకునేందుకు సరైనా మౌలిక సదుపాయాలు కలిపించాలి. పంట ను కోసిన తరువాత వాటిని నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు ప్రతి ఊరిలో ఏర్పాటు చేసే భాద్యత ప్రభుత్వానిది. అలాగే మార్కెట్ లో దళారుల వ్యవస్థను అరికట్టడానికి ప్రజలే తమ ఉత్పత్తిని మార్కెట్ ద్వారా అమ్మెందుకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇవేమి ప్రభుత్వాలు పట్టించుకోవు. కంటి తుడుపు చర్యగా రుణ మాఫీ ప్రకటించి తమ చేతులు దులుపుకోవటానికి ప్రబుత్వాలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా క్రెడిట్ సిస్టమ్ ను ఇంకా పటిష్ఠపరిచాల్సిన అవసరం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: