భారతదేశంలో అత్యల్ప నిరక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు భూగర్భ శాస్త్రవేత్తలను పిల్లలను కిడ్నాప్ చేసే వారీగా భావించి ప్రజలు చితక్కొట్టేసారు. కేవలం చిన్న పిల్లలు అని జాలిపడి వారికి యాపిల్ కాయలు మరియు అరటి పండ్లు ఇవ్వడమే శాస్త్రవేత్తలు చేసిన నేరం అయింది. చివరకు వారి ప్రాణాల మీదకు తెచ్చింది.

బీహార్లోని నౌహతా దగ్గర చాఫ్లా అనే గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చాలా అమానుషం. ఇద్దరు భూగర్భ శాస్త్రవేత్తలు- రోటంగ్ మరియు మనీష్ కుమార్ మణిపూర్ మరియు కలకత్తాలోని జాతీయ భూగర్భ సర్వే డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటారు. బుందాక్ అనే గ్రామంలో వారు సర్వే జరుపుతుండగా దగ్గరలోని ఇద్దరు పిల్లలు అక్కడ పశువులకు మేత వేస్తూ కనిపించారు. వారికి అభిమానంగా ఆపిల్ పండ్లు మరియు అరటిపండ్లు పంచిపెట్టారు.

అయితే వారిలో ఒకడు తిరిగి తమ గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని అక్కడి వారితో చెప్పాడు. దీంతో ఈ విషయం ఆ నోట ఈనోట పాకి వాళ్లు పిల్లలని ఎత్తుకుపోయే వారు అని అబద్ధ ప్రచారం జరిగింది. దీంతో ఊరి వారంతా దొరికిన పనిముట్లు, ఆయుధాలు తీసుకొని వచ్చి పాపం ఆ శాస్త్రవేత్తలను పట్టుకొని చితక్కొట్టారు. అంతేకాకుండా వారరు వేసుకుని వచ్చిన కారుని కూడా నాశనం చేశారు. 

ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన ఇద్దరూ వెంటనే పోలీసులకి ఆ గ్రామస్థుల పైన ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 100 మంది పైన ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సరిగ్గా ఇలాంటి విషయమే ఇంతకుముందు పాట్నాలోని దనపుర్ దగ్గర ఇద్దరు సిక్కు పర్యాటకులని ఒక గుంపు పిల్లల కిడ్నాపర్లుగా భావించి ఇలాగే చావ బాదారు. అయినా పాపం ఆ శాస్త్రవేత్తలు భూమి లోపల ఏమున్నాయో కనుక్కుందామని పోయి ఈ భూమి పైన ప్రజలకు మంచి చేస్తే తప్పుగా అర్థం చేసుకొని చావకొడతారు అని కనుక్కున్నారు కాబోలు.


మరింత సమాచారం తెలుసుకోండి: