ప్ర‌స్తుత స‌మాజంలో సోష‌ల మీడియా ప్ర‌భావం విప‌రీతంగా పెరిగిపోయింది. దీని వ‌ల్ల‌ చిన్నా.. పెద్దా తేడా లేకుండా చాలా మంది మోస‌పోతున్నారు. ముక్యంగా య‌వ‌త‌ టైమ్ వేస్ట్ చేసుకుంటూ తెలిసి తెలియని వయసులో సోషల్ మీడియా మోస‌గాళ్ల‌కు చిక్కి తమ జీవితాల‌ను పాడుచేసుకుంటూ.. ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతులను ట్రాప్ చేస్తూ క‌ల‌క‌లం సృష్టించారు. చెన్నైకి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి దాదాపు 16 రాష్ట్రాల్లో 600 మంది మ‌హిళ‌ల‌ను ట్రాప్ చేశారు. 


క్వికర్. కామ్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల వివరాలు, ఫోన్ నెంబర్లను సేకరించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ  ఫోన్ చేసి ఇంటర్వ్యూలు చేసేవాడు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగానికి ఎంపిక అవ్వాలంటే శ‌రీరాకృతి బాగుండాల‌ని ఆ అమ్మాయిల దగ్గ‌ర నుంచి వారి న‌గ్న చిత్రాల‌ను సేక‌రించాడు. ఆ త‌ర్వాత వాళ్ల‌కు నేరుగా ఫోన్ చేసి అస‌భ్యంగా మాట్లాడుతూ.. ఈ సంగ‌తి బ‌య‌ట‌కు చెబితే వారి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడతాన‌ని బెదిరించే వాడు. ఇక స‌హించ‌లేని ఓ బాధితురాలు పోలీసుల‌కు చెప్పి ప్ర‌దీప్ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.


అలాగే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డికి, హర్షిణికి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఇద్ద‌రూ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని ఛాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది. ఓ ఆగ‌ష్టు 27న న‌వీన్ హ‌ర్ణిణిని బ‌య‌ట‌కు వెళ్దామ‌ని ఆమెను శంకరాయపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీనికి హర్షిణి తీవ్రంగా ఖండించ‌డంతో ఆమెను బండరాయితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌డంతో న‌వీన్‌ను ప‌ట్టుకున్నారు.


వనపర్తి జిల్లాకు చెందిన కేశవర్థన్ డిగ్రీ చదువుతున్నాడు. ఆత‌డు దాదాపు నెల రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే స‌రైన స‌మ‌యాన‌కి ఆహారం తీసుకోక‌పోడంతో ఆత‌డి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తింది. ఇది గ‌మ‌నించిన త‌ల్లి ఆసుప‌త్రి తీసుకువెళ్లినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. మ‌రింత‌గా ఆరోగ్యం క్షీణించ‌డంతో చివ‌ర‌కు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి కారణంగా ఇలా జ‌రిగింద‌ని చికిత్స చేసి సెల్‌ఫోన్‌కు, ఫ‌బ్‌జీ దూరంగా ఉండ‌మ‌ని హెచ్చ‌రించారు. దీనిని బ‌ట్టి సోష‌ల్ మీడియా మాయలో ప‌డి యువ‌కులు ఎలా చిత్త‌వుతున్నారో ? అర్థం చేసుకోవ‌చ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: