స‌హ‌జంగా త‌ల‌ను త‌ల ఢీ కొడితే కొమ్ములు వ‌స్తాయి అన్న నానుడి ఉంది. అది ఎంత వ‌ర‌కు నిజ‌మో ప‌క్క‌న పెడితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ వ్య‌క్తికి త‌ల‌పై కొమ్ము వ‌చ్చింది. ఇది నిజంగానే వింత. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని 74 ఏళ్ల శ్యాంలాల్ యాదవ్ అనే వ్యక్తికి త‌ల కొమ్ము వ‌చ్చింది. సాగర్ జిల్లాలో ఉన్న రాహ్లీ గ్రామానికి చెందిన ఆ వ్య‌క్తికి కొన్నేళ్లుగా తలపై ఈ కొమ్ము ఉండేదని తీయించుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లగా అసలు విషయం తెలిసింది.


చాలా సంవత్సరాల క్రితం తలకు గాయం అయిన వెంటనే తన చర్మంపై కొమ్ములా ఏర్పడటం ప్రారంభించిందని శ్యామ్ లాల్ యాదవ్ చెప్పారు. ఆ కొమ్ము కాలక్రమేణా పెద్దగా పెరుగుతూ వ‌చ్చింది. ప్రారంభంలో ఇది కొంచెం వింతగా అనిపించింది కానీ అతను దానిని అలవాటు చేసుకున్నాడు. ఇక పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు చిన్నగా దాన్ని కట్ చేయడం మొదలు పెట్టాడు. అయినా అది పెరుగుతూనే వ‌స్తుండ‌డంతో శ్యాంలాల్ వైద్యుల‌ను ఆశ్ర‌యించాడు.


శ్యామ్ లాల్ సేబాషియస్ హార్న్ పరిస్థితితో బాధపడుతున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇది సాధారణంగా సూర్యరశ్మి ఎక్కువగా చర్మంను తాకితే సంభవిస్తుంది. సెబాషియస్ హార్న్ ను డెవిల్స్ హార్న్ అని కూడా పిలుస్తారు. ఎక్స్-రే తరువాత, దాని మూలాలు చాలా లోతుగా లేవని తెలిసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆపరేషన్ చేసి ఈ కొమ్మును తొలగించినట్లు డాక్టర్ విశాల్ గాజ్‌బియే చెప్పారు. అరుదైన కేసులలో ఇది ఒకటి కనుక ఈ అరుదైన కేసును ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురించడానికి పంపుతామని వైద్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: