కాటుక కనులకి అందం, పెదవులకు నవ్వు అందం.... కురులే స్త్రీకి అందం అంటూ ఉంటారు. అలాంటి కురులు కొద్దిగా రాలిన కుమిలిపోతారు మగువలు.రోజులో సగ భాగం తమ కురుల పోషణకే కేటయుంచే వారు కూడా ఉన్నారు. అటువంటిది చూడ ముచ్చటగా ఉన్న జడని కత్తిరించుకోవడమంటే ఎవరికి మనసొప్పుతుంది చెప్పండి.కానీ కేరళకు చెందిన ఓ పోలీసు అధికారిణి మాత్రం తన పొడుగాటి జడను కత్తిరించుకుంది. 


అది కూడా ఓ మంచి పని కోసమే ఆమె ఇలా ఏకంగా గుండు చేయించుకున్నారు. పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తూ, ఇలా సామాజిక దృక్పధంతో ఆమె చేసిన ఈ పనికి సోషల్ మీడియా వేధికగా నెటిజన్లు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  కేరళకు చెందిన అపర్ణ లవకుమార్ త్రిశూర్‌లో ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో  సీనియర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.ఆమె క్యాన్సర్ రోగుల కోసం తన జుట్టును దానం చేసేందుకు ముందుకు వచ్చారు. 

కాన్సెర్ బారిన పడిన రోగులకు చికిత్సలో భాగంగా కిమోథెరపీ వల్ల చాలా మంది జుట్టు కోల్పోయి బాధను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు తన వెంట్రుకలను విగ్గు తయారు చేసేందుకు దానంగా ఇచ్చారు. క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పాఠశాలలో ఓ పదేళ్ల చిన్నారిని చూసిన తరువాత ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ పోలీసు మాన్యువల్‌ ప్రకారం ఏ అధికారి ఐన గుండు చేయించుకోవాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం తప్పని సరి. 

అందుకే అధికారుల పర్మిషన్ తీసుకొని మరీ ఆమె ఇలా గుండు చేయించుకున్నారు. ఇది మొదటి సారి కాదు గతంలోనూ ఆమె ఇలానే తన జుట్టుని దానం చేశారు. కానీ అప్పుడు భుజాల వరకు మాత్రమే జట్టు కత్తిరించుకున్నారు. ఐతే ఇప్పుడు మాత్రం పూర్తిగా గుండు కొట్టించుకుని తన జట్టును ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: