ఇకపై ఆన్‌లైన్‌లో వస్తువుల విక్రయాలు కొనుగోలు చేసే ప్రజలు కాస్త జాగ్రత్తగా వుండాలి. రూ.50 వేలకు పైగా విక్రయాలు చేసినవారికి ఫ్రీ గిఫ్ట్‌ప్యాక్‌ ఇస్తామంటూ ఓ ముఠా భారీ మోసానికి పాల్ప డింది. ఆ ముఠా ఈ హై టెక్నాలజీని వినియోగించి ఇప్పటికే రూ.3 కోట్లు కాజేసి పోలీసులకు పట్టుబడింది. దిండుగల్‌ జిల్లా వత ్తలగుండు ప్రాంతానికి చెందిన కన్నన్‌ (40) ప్రైవేటు సంస్థలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల అతను జిల్లా ఎస్పీ శక్తివేల్‌కు అందించిన ఫిర్యాదులోని వివరాలిలా వున్నాయి.ఆన్‌లైన్‌లో ఓ బస్సును కొనుగోలు చేశామని, కొద్ది రోజుల తరువాత తనకు ఓ ఫోన్‌కాల్‌ వచ్చిందని, అశ్విన్‌ అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ, రూ.50 వేలకు ఆన్‌లైన్‌ కొనుగోలు చేయడం వల్ల రూ.12 లక్షల విలువ చేసే ఫ్రీ గిఫ్ట్‌ప్యాక్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ గిఫ్ట్‌ప్యాక్‌ను డోర్‌ డెలివరీ చేసేందుకు సర్వీస్‌ ట్యాక్స్‌, రోడ్‌ ట్యాక్స్‌, ఇతర పన్ను లు కలిసి మొత్తం రూ.96 వేలు తమ ఖాతాలో వేస్తే మరు సటి రోజు గిఫ్ట్‌ ప్యాక్‌ ఇంటికి చేరుతుందన్నారు.

వారి మాటలు నమ్మి కన్నన్‌ రూ.96 వేలు ఖాతాలో చెల్లించి నప్పటికీ ఎలాంటి గిఫ్ట్‌ప్యాక్‌ రాలేదని స్పష్టం చేశారు.అదే విధంగా తమ సంస్థలో పనిచేసే మరో వ్యక్తి కూడా గిఫ్ట్‌ప్యాక్‌ పేరుతో రూ.50 వేలు మోసపోయారని పేర్కొన్నారు. మోసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. జిల్లా పోలీసులు కేసు నమోదు చేసు కుని విచారణ చేపట్టారు. ఎస్పీ నేతృత్వంలో మూడు బృందాలు ఈ ముఠా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా విచారించిన పోలీసులు చెన్నై మీనాంకరైకి చెందిన దయానిధి (36), కార్తీక్‌ శర్మ(28), శరత్‌బాబు (42), జయచంద్రన్‌ (40), బెంగళూరుకు చెందిన రఫిన్‌ కలిసి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారిని గుర్తించి గిఫ్ట్‌ప్యాక్‌ పేరుతో మోసానికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: