ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంలో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  మొదట ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ కలిసి స్కాం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఓమ్నీ మెడి ఫార్మాతో పాటు మరో నాలుగు కంపెనీల నుంచి నకిలీ బిల్లులు సృష్టించారని విచారణలో వెల్లడైంది.  కాగా  విచారణలో నిందితుల నుండి ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ రికార్డింగ్స్‌లోని వివరాలు ప్రకారం సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాధ్.. తప్పుడు బిల్లులు పెట్టాలని ఈఎస్ఐ డాక్టర్‌ను ఆదేశించాడు. రూ. 50 లక్షలకు తప్పుడు బిల్లులను సృష్టించాలని సదురు డాక్టర్‌పై అతడు ఒత్తిడి తెచ్చాడు.

 ఏడాది తర్వాత క్యాంపు నిర్వహించినట్లు బిల్లులు తయారుచేయాలని ఆమెకు సూచించాడు.  అయితే ఇలాంటి బిల్లులు తయారు చేయలేనని డాక్టర్ తెగేసి చెప్పడంతో సురేంద్రనాధ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. డిమాండ్‌ లేకపోయినా మందుల కొనుగోలు చేశారని, డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేసినట్లు దొంగలెక్కలు చూపాలని బెదిరించాడు.

ఈ స్కాంలో కీలక సూత్రధారి ఓమ్నీ ఎండీ నాగరాజుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాకుండా మరో మహిళా అధికారిని సైతం ఫోన్ చేసి బెదిరించాడు. డైరెక్టర్‌ అండ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బిల్లుల కోసం అడుగుతున్నారని సురేంద్రనాథ్‌ ఈఎస్‌ఐ డాక్టర్‌కు చెప్పినప్పటికీ తాము నిబంధనలు ప్రకారమే ముందుకు వెళ్తామని సదరు డాక్టర్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


 ఈ కేసుకు ఇప్పటికే ఏడుగురు నిందితులు అరెస్టు కాగా.. వారికి అక్టోబర్‌ 11 వరకు ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించింది.  దీంతో పోలీసులు నిందితులను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: