ట్రైన్ ప్రయాణం అందరికి ఇష్టమే.  ట్రైన్ ప్రయాణమంటే అందరికి సరదానే. కాకుంటే.. సౌకర్యాల లేమి విషయంలో భారత రైల్వేలు చాలా ముందుంటాయన్న విమర్శ కూడా  ఉంది. డిజిటల్ యుగంలోనూ జమానా క్రితం కోచ్ లు.. అశుభ్రం.. సౌకర్యాల లేమి చాలా ఎక్కువన్న పేరుంది. దీనికి భిన్నమైన ట్రైన్ ఒకటి ఈ నెల నాలుగు నుంచి పట్టాలెక్క పోతుంది. ఈ ట్రైన్ విశేషాలు వింటే.. రానున్న రోజుల్లో రైలు ప్రయాణ స్వరూపం మొత్తంగా మారిపోతుందన్న నమ్మకం కలుగుతుంది.

ఈ రైలెక్కిన వారంతా తాము ప్రయాణిస్తున్న ట్రైన్ ఆలస్యమైతే బాగుండనుకోవటం ఖచ్చింతం. దీనికి కారణం లేకపోలేదు.ఈ రైలు గమ్యస్థానానికి చేరాల్సిన సమయానికి చేరకుండా.. ఆలస్యమైతే నష్టపరిహారాన్ని ఇస్తుంది మరి. ఈ తరహా ప్రయోగాన్ని తొలిసారి భారత రైల్వేలో ప్రవేశ పెడుతున్నారు. సరి కొత్త సేవలు అందించే ఈ ట్రైన్ ఢిల్లీ- లక్నో మధ్య పరుగులు తీయనుంది.

అక్టోబరు నాలుగున తేజస్ ఎక్స్ ప్రెస్ లో కొత్త తరహా సౌకర్యాల్ని ప్రవేశ పెడుతున్నారు. దీనికి తగ్గట్లే టికెట్ ధర కూడా కాస్త ఎక్కువే ఉంది. ఢిల్లీ నుంచి లక్నోలో ఈ ట్రైన్ లో ఏసీ ఛైర్ కార్ లో ప్రయాణించాలంటే రూ.1280 ఛార్జ్ చేస్తారు అని తెలుపుతుంది. అదే ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ అయితే రూ. 2450గా ఉండనుంది. అదే సమయంలో లక్నో నుంచి ఢిల్లీకి వచ్చే ఇదే ట్రైన్ ఛార్జీలు కాస్త తక్కువగా ఉండటం గమనించవచ్చు.

ఈ రైల్లో ఉచితంగా టీ.. కాఫీలతో పాటు మినరల్ వాటర్ ను కూడా అందిస్తారు. వెండింగ్ మిషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు ప్రయాణకుల అందరికి. విమానాల్లో మాదిరి ఆహారాన్ని అందించనున్నారు. ఈ ట్రైన్లో ప్రయాణం జరుగుతున్నప్పుడు ఏదైనా దోపిడీ జరిగితే రూ.లక్ష బీమాగా ఇవ్వనున్నారు. అంతేకాదు.. ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా సౌకర్యం ఉంది. వీటన్నింటితో పాటు.. ఇప్పటివరకూ దేశంలో మరే రైల్లో లేని విదంగా ఈ ట్రైన్ గంట ఆలస్యంగా వస్తే రూ.100.. రెండు గంటలు ఆలస్యమైతే రూ.250 మొత్తాన్ని పరిహారం రూపంలో ప్రయాణికులకు చెల్లిస్తారు అని తెలిపారు రైల్వే బోర్డు.

కాకుంటే.. ఈ ట్రైన్ టికెట్ల ధరలు డైనమిక్ గా ఉంటాయి. డిమాండ్ కు తగ్గట్లు ధరలు పెరిగిపోతూ ఉంటాయి. విన్నంతనే ప్రయాణం చేయాలనిపిస్తున్న ఈ ట్రైన్ ప్రయోగం ఫలిస్తే.. దేశ వ్యాప్తంగా మరిన్న రైళ్లలో ఈ సౌకర్యాల్ని ఏర్పాటు చేయనున్నారు.సౌకర్యాలు దగ్గట్టు ధర కూడా ఉంది కదా...


మరింత సమాచారం తెలుసుకోండి: