మీరు స్థిరాస్తి కొన్నారా.!! అయితే ముందులా ఇప్పుడు దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు., సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకి వెళ్లక్కర్లేదు.., ఇక నుంచి ఆస్తి కొనుగోలు దస్తావేజులను స్వయంగా మీరే తయారు చేసుకోవచ్చు. 

అదెలానో చూసేద్దామ మరీ:-

ముందుగా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్‌ అనే బాక్సులో డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ అని ఉంటుంది. దీనిని క్లిక్‌ చేసి పాస్‌వర్డ్, ఐడీ రిజిస్టర్‌ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్‌కార్డ్ నంబరు, అమ్మకదారుని పేరు, నివాస ప్రాంతం, అమ్మకదారుని ఆధార్‌ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంట్ ఉంటుంది.  స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్‌ నంబరు/ప్లాట్‌ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది.

ఆస్తి వివరాల్ని నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. దాని ప్రకారమే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్‌ తీసుకుని సబ్‌మిట్‌ అని క్లిక్‌ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్‌లైన్‌లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు. 

ఇలా మన పని సులువవుతుంది......

మరింత సమాచారం తెలుసుకోండి: