ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండ‌లేక పోతున్నారు. టాయ్‌లెట్‌కి వెళ్లేట‌ప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ వెంట తీసుకెళ్తున్నారు. అయితే అలా తీసుకెళ్ల‌డం వ‌ల్ల డ‌యేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన ప‌డే అవకాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చరిస్తున్నారు. టాయ్‌లెట్‌లో ఉండే సింకులు, న‌ల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు క‌లిగించే బాక్టీరియా ఉంటుంద‌ని, టాయ్‌లెట్‌కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్ల‌ను ముట్టుకున్న చేతుల‌తోనే మ‌ళ్లీ మొబైల్ ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల బాక్టీరియా ఫోన్ మీద‌కి చేరుకుంటుంద‌ని, అలా చేరుకోవ‌డం వ‌ల్ల ఎప్పుడూ తోడుగా ఉండే ఫోన్ నుంచి ఏదో ర‌కంగా బాక్టీరియా శ‌రీరంలో ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంద‌ని లండ‌న్ మెట్రోపాలిట‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్ట‌ర్ పాల్ మెటెవాలే తెలిపారు.

ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా...


దీంతో పాటు సాధార‌ణంగా చేసే కొన్ని ప‌నుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల కూడా ప్ర‌మాదాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. బ్యాగుల‌ను శుభ్రం చేయ‌క‌పోవ‌డం, బూట్ల‌ను ఇంటి లోప‌ల ధ‌రించ‌డం, విప్ప‌డం, టీవీ రిమోట్, కంప్యూట‌ర్ కీబోర్డు, మౌస్‌ల‌ను శుభ్రం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు.


పైల్స్ గ్యారంటీ


మీరు టాయ్‌లెట్ వెళుతూ స్మార్ట్‌ఫోన్‌ని మీతో తీసుకెళ్లారంటే పైల్స్ (మూలశంక) బారిన పడటం గ్యారంటీ అంటున్నారు వైద్య పరిశోధకులు. దీని వల్ల పైల్స్‌తోపాటు ప్రమాదకరమైన పర్యవసానాలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే చాలామంది ఫోన్‌తో సహా టాయెలెట్‌లోకి వెళ్లే అలవాటును కలిగి ఉన్నా.. కొద్ది మంది మాత్రం దానిద్వారా వచ్చే ప్రమాదకర పర్యవసానాల గురించి తెలుసుకుంటున్నారని తాజా అధ్యయనం చెబుతోంది.


ఎక్కువ సేపు టాయెలెట్‌లో..


బాత్‌రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడమే అసలు సమస్య కాదని, ఎక్కువ సేపు టాయెలెట్‌లో అలాగే కూర్చుండిపోవడమన్నదే పైల్స్‌కి దారితీస్తుందని వారు చెబుతున్నారు. చాలాసేపు టాయ్‌లెట్‌లో కూర్చోవడం, ప్రయాస పడటం వల్ల నొప్పి, చెమటలు పట్టడం, రక్తం కారటం వంటి లక్షణాలు ఏర్పడతాయని చెప్పారు.


స్మార్ట్ ఫోన్ ముచ్చట్ల గొడవలో పడి 


బ్రిటన్‌లో 57 శాతంమంది ప్రజలు టాయె‌లెట్‌కి ఫోన్ పట్టుకెళుతున్నామని ఒక సర్వేలో తెలిపారు. వీరిలో 8 శాతం మంది ఆపని నిత్యం చేస్తుంటారట. టాయ్‌లెట్‍‌లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు సమయం కూడా చూసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారని, స్మార్ట్ ఫోన్ ముచ్చట్ల గొడవలో పడి అక్కడ చేయాల్సిన అసలు కార్యక్రమం మర్చిపోతుంటారని, దీంతో శరీరం మలవిసర్జనకు ఫ్రీగా సహకరించక పైల్స్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: