ఈ ఊరు ఆ ఊరు అని తేడా లేకుండా దసరా సందడి సాగుతున్న ఈరోజు జరిగే ఈ పండుగకు ఇప్పటికే నగర వాసులందరు సొంతూరికి చేరుకున్నారు. అక్టోబర్ 8 న దసరా పండుగ కాగా అక్టోబర్ 10వ తేదీ ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిన  అంశం ఇదిఒకటి ఉంది. ఆది ఏమిటంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా చేపడుతోంది. ఈ రోజు గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే మన దేశంలో మానసికంగా కృంగిపోయి ఏటా రెండు లక్షల మంది పైనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి.


ప్రతి ఏడాదికి ఎనిమిది లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో నాలుగోవంతు మరణాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2 లక్షల మంది ఇలా ఒక్క భారత్ లోనే చనిపోతున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చేబుతోంది. 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉన్నవారు ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఈ నివేదిక తెలియచేస్తుంది.


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1992 సంవత్సరం నుంచి ఈ రోజును నిర్వహిస్తోంది. మానసికంగా కృంగిపోతున్న వారిలో అవగాహన కల్పించడం ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలియజేస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పలు అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది.


ప్రస్తుతం మానసికంగా కృంగిపోయి సంభవిస్తున్న మరణాల్లో భారతదేశంలోని వారి సంఖ్య సైతం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దూరం అవ్వాలంటే ఆత్మీయ కుటుంబ సంబంధాలు, మంచి స్నేహితులు, పుస్తక పఠనం, ధ్యానం ఇలాంటివి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: