Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:02 am IST

Menu &Sections

Search

షకీల్ అఫ్రిది: బిన్‌ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో CIAకి సాయపడ్డ డాక్టర్... అమెరికాలో హీరో - పాకిస్తాన్‌లో ద్రోహి

షకీల్ అఫ్రిది: బిన్‌ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో CIAకి సాయపడ్డ డాక్టర్... అమెరికాలో హీరో - పాకిస్తాన్‌లో ద్రోహి
షకీల్ అఫ్రిది: బిన్‌ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో CIAకి సాయపడ్డ డాక్టర్... అమెరికాలో హీరో - పాకిస్తాన్‌లో ద్రోహి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేరుపడ్డ బిన్ లాడెన్‌ను అమెరికా ప్రత్యేక సైనిక బలగాలు వేటాడి చంపిన 2011 నాటి ఆపరేషన్‌లో డాక్టర్ ఆఫ్రిది పాత్రకు సంబంధించి ఆయన మీద ఇంతవరకూ అధికారికంగా ఆరోపణలు నమోదు చేయలేదు.


ఈ కేసులో బహిరంగ కోర్టు విచారణ చేపట్టనుండటం ఇదే మొదటిసారి. తనకు నిష్పాక్షిక విచారణను నిరాకరిస్తున్నారని ఈ డాక్టర్ ఆది నుంచీ వాపోతున్నారు.ఆయనను జైలులో పెట్టటం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనకు పాకిస్తాన్ 33 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది. దీనిపై అమెరికా తన నిరసన తెలుపుతూ.. పాకిస్తాన్‌కు తాను అందిస్తున్న సాయంలో 3.3 కోట్ల డాలర్లు (ఆ డాక్టర్‌కు విధించిన ఒక్కో సంవత్సరం జైలు శిక్షకు 10 లక్షల డాలర్ల చొప్పున) కోత విధించింది.


అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తాను ఎన్నికైతే డాక్టర్ అఫ్రిదిని ''రెండు నిమిషాల్లో'' విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు.ఈ డాక్టర్‌ను అమెరికాలో ఒక హీరోగా పరిగణిస్తుంటే.. పాకిస్తాన్‌లో చాలా మంది ఆయనను ఒక ద్రోహిగా చూస్తారు. అమెరికా నేవీ సీల్స్ బలగాలు ఎటువంటి ప్రతిఘటనా లేకుండా పాకిస్తాన్‌లోకి గగన మార్గంలో వచ్చి.. అమెరికాపై 9-11 దాడుల సూత్రధారి అయిన బిన్ లాడెన్‌ను చంపి, అతడి మృతదేహాన్ని కూడా తీసుకెళ్లగలగటం పాక్‌కు తలవంపులు తెచ్చిందని.. అందుకు డాక్టర్ అఫ్రిది కూడా కారణమని వారు భావిస్తుంటారు.


అంతేకాదు.. పాకిస్తాన్ భద్రతా విధానాన్ని నిర్వహించే సైన్యానికి బిన్ లాడెన్ తమ దేశంలోనే ఉన్నాడన్న విషయం తెలుసా అనే ఇబ్బందికర ప్రశ్నలకు కూడా అది తావిచ్చింది.తీవ్రవాద ఇస్లాం మీద అమెరికా సారథ్యంలో జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్.. అసహనంగానే భాగస్వామిగా కొనసాగుతోంది.


ఎవరీ షకీల్ అఫ్రిది?

డాక్టర్ అఫ్రిది గిరిజిన జిల్లా ఖైబర్‌లో ఉన్నతస్థాయి వైద్యుడు. ఆరోగ్య విభాగానికి అధిపతి. అమెరికా నిధులతో చేపట్టిన అనేక రోగనిరోధక చర్యల (వాక్సినేషన్) కార్యక్రమాలకు సారథ్యం వహించారు.ప్రభుత్వ ఉద్యోగిగా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సైనిక పట్టణమైన అబోటాబాద్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుచేశారు. అక్కడ సైన్యం నీడలోనే బిన్ లాడెన్ జీవిస్తున్నట్లు వెల్లడైంది.ఇది నిర్ధారించుకోవటం కోసం అబోటాబాద్‌లోని ఆ ఇంట్లో నివసిస్తున్న పిల్లల రక్త నమూనా సేకరించాలని అమెరికా నిఘా విభాగం భావించింది. ఆ రక్త నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసి వారు లాడెన్ బంధువులా కాదా అనేది తేల్చాలన్నది ఉద్దేశం.


డాక్టర్ అఫ్రిది సిబ్బందిలో ఒకరు ఆ ఇంటికి వెళ్లి రక్తం నమూనా సేకరించారని భావిస్తున్నారు. అయితే.. తమ లక్ష్యాన్ని నిర్ధరించుకోవటంలో అమెరికా విజయవంతం కావటానికి ఇది సాయపడిందా లేదా అన్నది తెలియదు.


బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు చంపిన 20 రోజుల తర్వాత 2011 మే 23న డాక్టర్ అఫ్రిదిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వయస్సు 50 ఏళ్లకు దగ్గరపడుతోంది.ఆయన 1990లో ఖైబర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో పట్టభద్రులయ్యారనే విషయం మినహా.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. ఆయనను అరెస్ట్ చేసినప్పటి నుంచీ.. తమపై తీవ్రవాదులు దాడులు చేస్తారనే భయంతో ఆయన కుటుంబం రహస్యంగా జీవిస్తోంది.


ఆయన భార్య అబోటాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు - మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు.డాక్టర్ అఫ్రిది అమెరికా నిఘా సంస్థ కోసం పనిచేశారని అమెరికా అధికారులు 2012 జనవరిలో బహిరంగంగా అంగీకరించారు.


కానీ.. సీఐఏ కోసం పనిచేయటంలో తన పాత్ర ఎంత అనేది ఆయనకు ఎంతవరకూ తెలుసుననే అంశం మీద స్పష్టత లేదు. లాడెన్‌ను అమెరికా బలగాలు చంపిన ఉదంతం మీద విచారణ జరిపిన అబోటాబాద్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన డాక్టర్ అఫ్రిది తన పాత్ర గురించి ఏమీ చెప్పలేదు.


సీఐఏ డాక్టర్ అఫ్రిదిని రిక్రూట్ చేసుకున్నపుడు.. వారి ఆపరేషన్ లక్ష్యం ఎవరన్నది ఆయనకు తెలియదని పాకిస్తాన్ దర్యాప్తు నివేదిక పేర్కొంది.Doctor is hero in america..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకప్ గతం.. ర్యాంప్ వాక్ ప్రస్తుతం!
పూజని నెం. 1 చేసేవరకూ ఊరుకోరా?
డాక్టర్ తో యంగ్ హీరో ప్రేమాయణం
సరిలేరు నీకెవ్వరు.. రష్మిక ఇప్పుడే మాట్లాడదు!
ఆయన క్లాసికల్‌కి పనికిరారు అన్నవారంతా ఆయనతోనే క్లాసికల్‌ చేయించుకున్నారు
ఫ్యామిలీ అంతా టీవీ యాడ్ లో..
సైరాకి కలిసొస్తున్న కేసీఆర్ హాలీడేస్
ఇంకా భ్రమలోనే ఉన్న పాయల్!
టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పొంగులేటికి చండీయాగం కలిసివస్తుందా....
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
అమెరికాలో సైరా కలెక్షన్స్ $2.44
ఓంకార్‌ మామూలోడు కాదు.... ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటాడు
ఆర్టీసీ సమ్మెపై విజయశాంతి భావోద్వేగం
బిగిల్ ట్రైలర్ పై భారీ అంచనాలు
ప్రతి నిమిషం భయంతోనే జీవిస్తున్నా....అందాన్ని పరిరక్షించుకోవడానికి
ఆర్టీసీ సమ్మెపై పవన్ కల్యాణ్ స్పందన
వెంకీ - కళ్యాణ్ రామ్ వచ్చేదెప్పుడంటే ?
సంక్రాంతి పోటీ: బంగారు బాతును కోస్తున్నారా?
వ్యభిచారిణులకు నెలవారీ జీతాలు.. నెల్లూరులో కొత్త పంథాలో సెక్స్ రాకెట్
ముఖ్యమంత్రి ని కలిసిన మెగాస్టార్..
‘ఆ హీరోయిన్‌ని నల్లగా మార్చేస్తారా, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుందో’
బాక్సాఫీస్ వద్ద ‘వార్’ దూకుడు.. రూ.250 కోట్లు దాటిన కలెక్షన్
విస్కీ తాగడం మానేస్తే.. నా ఆరోగ్యం పాడైంది : శృతి హాసన్‌
అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌లో దీప్తి అదుర్స్
రాజమౌళి ట్వీట్‌కు స్పందించిన పీవీ సింధు.. టూ లేటబ్బా..!!
కడుపుబ్బా నవ్వించడానికి భజన బ్యాచ్ రెడీ.
సమంత 96 రీమేక్ లో ప్రత్యేక పాత్ర
పాకిస్తాన్‌ పైన అణుబాంబు వెయ్యాలనుకునేవారు వాళ్ళకి ఓటు వెయ్యండి
మరో కార్మికుడు మృతి...ఇక నైనా మారండి కే.సీ.ఆర్ సారు...
రామ జన్మ భూమికి విముక్తి దొరకనుందా...
‘సైరా’ @ రూ.100 కోట్లు.. మెగాస్టార్ ఖాతాలో కొత్త రికార్డ్
ఆ సినిమాకు తమన్నా ఎందుకు తప్పుకుందంటే!
బిగ్ బాస్ వివాదం చివరికి సల్మాన్ ఇంటి ముందు ధర్నా
మళ్లీ హిమాలయాల బాట పట్టిన రజనీ.....!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.