ప్రధాని నరేంద్ర మోదీ విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలోగల దసరా మైదానంలో రావణుని దహనం చేశారు. ఇక్కడికి వచ్చేందుకు మోదీ ఢిల్లీ మెట్రోకు చెందిన ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ప్రయాణించారు. కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సామూహిక శక్తిని పరిచయం చేశారన్నారు. కొన్ని వేల ఏళ్ల నాటి సంప్రదాయాలు, వీరుల ఘనమైన చరిత్రలు, సాంస్కృతిక వికాసంతో దేశం పరిఢవిల్లిందన్నారు.

ఈ నేపధ్యంలోనే చేసుకుంటున్న ఉత్సవాలు మనకు సంస్కారాన్ని, సామూహిక జీవన విధానాన్ని నేర్పిస్తున్నాయన్నారు. సంవత్సరంలోని 365 రోజుల్లోనూ ప్రతీరోజూ ఏదోఒక చోట ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని అన్నారు. అలాంటి ఉత్సవాలకు క్లబ్ కల్చర్‌తో కాకుండా పవిత్ర భావనతో హాజరుకావాలి. సమయం ఉన్నప్పుడే మనలోని అసుర లక్షణాలను తొలగించుకోవాలి. అప్పుడే రాముని లక్షణాలను అనుభూతి చెందగలం. రాముడిని మన అనుభూతిలోనికి తెచ్చుకోవాలంటే మనం శక్తిసామర్థ్యాలను మరింతగా పెంపొందించుకోవాలని మోదీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: