పాకిస్తాన్ లో మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా....?వాళ్ళు అమెరికాలోని లాస్ ఏంజెల్స్  వెళ్లాలనుకుంటున్నారా? ఐతే పాకిస్తాన్ లోని కరాచీలో రైలు ఎక్కితే డైరెక్ట్ గా  అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్లొచ్చని వాళ్లకి తెలియదేమో కాస్త మీరైనా చెప్పండి. ఏంటి రైలు ఎక్కితే   అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్ళొచ్చా ....అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఫోటో చూసారుగా. ఈ ట్రైను కరాచీ నుండి డెస్టినేషన్ లాస్ ఏంజెల్స్ వెళ్తుందని రాసి ఉంది చూసారా ? దాని గురించే మేము చెప్పేది.

ఇంతకీ నిజంగా ఈ ట్రైన్  లాస్ ఏంజెల్స్ వెళ్తుందా అనేదే కదా మీ అనుమానం....ఐతే వివరాల్లోకి వెళ్లాల్సిందే.  దాయాది దేశం అయిన పాకిస్తాన్ చేసే పనులు ప్రపంచ దేశాలకు సైతం ఒక్కో సారి మంట పుట్టిస్తాయి. ఇక ఆ దేశ అధ్యక్షుడు చేసే వ్యాఖ్యలకు మన వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్ విషయంలో భారత్‌పై ఏ స్థాయిలో విద్వేషం వెళ్లగక్కారో తెలిసిందే.

పావు గంట మాట్లాడరా బాబు అంటే.. ముప్పావు గంటకుపైగా మాట్లాడి మరి భారత్‌‌ను టార్గెట్ చేయడానికి శతథా ప్రయత్నించారు. మన ప్రధాని మోడీ గారిని రాష్ట్రపతి అని సంబోదించి అందరి ముందు నాలుక కరుచుకొని నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు పాకిస్తాన్ రైలు కూడా అందరిని నవ్విస్తుంది. ఈ పాకిస్థానీ రైలు కరాచీ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తుందట.. అందరు విని ఆశ్చర్యపోయారు. కొందరేమో అయ్యో మాకు తెలియాదే....తెలిసుంటే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం అన్ని కామెంట్లు చేస్తున్నారు.

పాకిస్థాన్ రైల్వే చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారి నవ్వులు పూయిస్తోంది. కరాచీ నుంచి బయల్దేరి వెళ్తున్న ఓ రైలు డెస్టినేషన్ బోర్డులో గమ్యస్థానానికి బదులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్తున్నట్లు చూపించింది. ఇది గమనించిన ఒక ప్రయాణికుడు అది కాస్త వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసాడు. ఇంకేముంది  దీంతో పాక్ రైల్వేను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: