పాము ఈ పేరు చెబితే కొందరు బయ పడతారు,మరికొందరు పూజలు చేస్తుంటారు.చాలా మంది ఆ దరి దాపుల్లోకి కూడా పోరు.అలాంటిది ఏకం గా ఏడు తలల పాము కనిపిస్తే అది కూడా కుబుస రూపం దాలిస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక చోట అలానే జరిగింది.వివరాల్లోకి వెళ్తే బెంగళూరులో ఏడు తలల పాము యొక్క కుబుసం ఆశ్చర్యపరిచింది.నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో ఇది కనిపించింది. బుధవారం గ్రామంలోని గుడి పరిసరాలను శుభ్రం చేస్తున్న బాలప్ప అనే వ్యక్తి దీన్ని చూశాడు. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని పూజలు చేయడం ప్రారంభించారు.

గతంలో కూడా ఏడు తలల పాము కుబుసం ఇక్కడ కనిపించిందని, అప్పుడే దానికి గుడి కట్టాలని నిర్ణయించామని తెలిపారు. పాములు నెల నుంచి రెండు నెలల మధ్య కాలంలో చర్మాన్ని విడుస్తాయి. దాన్నే కుబుసం అని అంటారు. ఇలా కుబుసాన్ని విడిస్తేనే అవి పెద్దవిగా ఎదుగుతాయి.

ఏడు తలల పాముపై నిపుణులు భిన్న వాదన వినిపిస్తున్నారు. ఏడు తలల పాము అనేది పురాణాలకు పరిమితం అని, వాస్తవానికి అవి ఉనికిలో లేవని అంటున్నారు. ఈ దొరికిన ఆధారాలను కుబుసాన్ని పరిశీలిస్తే. ఒకే పాముకు అనేక తలలు ఉన్న విషయం స్పష్టమవుతోంది. మరి, దీనిపై పరిశోధకులు ఏమంటారో చూడాలి.దైవమే భువి పైకి వచ్చి జనులను ఆశ్చర్య పరచ నుందా లేక నిజంగానే ఇన్నాళ్లు కనిపించని ఆ ఏడు తలల పాము ఆనవాళ్లు ఎందుకు కనిపిస్తున్నాయి.శాస్త్రవేత్తలు సైతం ఇక్కడకు వచ్చి ప్రయశోధనలు చేస్తున్నారు అంటే ఈ ఏడు తల పాము కూడా దైవంశ సంభూతం అని కూడా అక్కడి ప్రజలు గుస గుస లాడుతున్నారు.ఇది ఇలానే కొనసాగితే అక్కడ గుడికడతారా లేక ఏమి చెయ్యానున్నారో అని కొన్ని రోజులు వేచి చూడాల్సిందే...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: