సివిల్స్‌ ఫలితాల్లోని రిజర్వ్‌ జాబితా ప్రతిభా క్రమంలో మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక చేస్తూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబరులో సివిల్స్ పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి- మార్చి నెలలో ఇంటర్వ్యూలు జరిగాయి. సివిల్స్‌–2018 పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదవ తేదీన ప్రకటించడం తెలిసిందే. 
ఐఐటీ ముంబైకి చెందిన కనిషక్ కటారియా సివిల్స్ 2018 టాపర్‌గా నిలిచాడు.


 అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించగా... జునైద్ అహ్మద్ మూడో ర్యాంకు, శ్రేయాన్స్ కుమత్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. శ్రుతి జయంత్ దేశ్‌ముఖ్ టాప్ 5లో నిలిచి, అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగువారిలో వరుణ్ రెడ్డి 7వ ర్యాంకు సాధించగా, అంకితా చౌదరి 14వ ర్యాంకు సాధించాడు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 812 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు గాను 759 మంది అభ్యర్థలను ఎంపిక చేసింది.


 వీరిలో జనరల్ కేటగిరి అభ్యర్థులు 361 మంది కాగా, OBC కేటగిరిలో 209 మంది, SC కేటగిరిలో 128 మంది, ST కేటగిరిలో 61 మంది ఎంపికయ్యారు. ఈ  అభ్యర్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ  పోస్టులకు ఎంపికయ్యారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల నిబంధనల ప్రకారం రిజర్వ్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అవసరం కోసం యూపీఎస్సీ మరో 53 మందిని అఖిల భారత సర్వీసుకు సిఫారసు చేసింది.

ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు. ఈ 53 మందిలో పలువురు తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా ఏపీలో పలువురు అఖిల భారత సర్వీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే కొందరికి కొత్తగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: