ఐఆర్‌సీటీసీ ఈ మధ్య ‘కర్వా చౌత్‌’  పండుగను పురస్కరించుకుని  కొత్తగా పెళ్లైన జంటల కోసం ఐఆర్‌సీటీసీ వాళ్ళు స్పెషల్  రైలును అందుబాటులోకి  తీసుకొచ్చింది.. ‘‘కర్వా చౌత్‌‌‌ను సందర్బంగా  మీ భార్యలకు జీవిత కాలం  గుర్తుండిపోయేలా  ఈ ప్రత్యేకమైన బహుమతిని  ఇచ్చి సర్‌ప్రైజ్ చెయ్యండి అని 'ద మెజిస్టిక్ రాజస్థాన్ డీలక్స్’  స్పెషల్  రైల్లో  ప్రయాణించేందుకు ఆహ్వానం పలికారు .అత్యంత విలాస వంతమయిన సౌకర్యాలతో  రాజసం  ఉట్టిపడేలా ఈ రైలుని రూపుదిద్దారు.

ప్రత్యేకతలు ఏమిటంటే రైలులో మొత్తం 78  సీట్లు ఉంటాయి,బాత్రూం లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ  షవర్లు.. విలాసవంతంగా రూపు దిద్దిన  డైనింగ్ రూమ్‌లు మరియు మసాజ్ కోసం స్పెషల్ రూమ్స్  సైతం ఏర్పాటు  చేయబడ్డాయి.టూర్ మొత్తం ఐదు రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో రాజస్థాన్‌లోని చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. కర్వాచౌత్ నేపథ్యంలో అక్టోబరు 14న ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్లో మొదలవుతుంది అని ప్రకటన విడుదల చేసారు.. కానీ ఐఆర్‌సీటీసీకి వాళ్ళకి ఊహించని షాక్ ఇచ్చారు భర్తలు అందరు..

ఈ ప్రత్యేక రైలు కోసం అక్టోబరు 11 వరకు కేవలం రెండు  మూడు జంటలు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవటంతో ఐఆర్‌సీటీసీకి  ఈ ప్రత్యేక రైలును రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు . ఎందుకంటే మిగతా మూడు రోజుల్లో  కూడా బుకింగులు జరిగే అవకాశాలు శూన్యమే అని  వినిపించసాగాయి.ఇందుకు  ముఖ్యమయిన కారణం ఏమిటంటే రైలు టికెట్ ధరలు  ఆకాశాన్ని మినంటుతున్నాయి.

ఒక జంట  ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించాలంటే  రూ.1,02,960, టూటైర్ ఏసీలో ప్రయాణించే జంట రూ.90,090  మరి అంత డబ్బు  చెల్లించి,ఐదు రోజులపాటు పనులు వదులుకొని  షికార్లు  కొట్టడానికి  ఎవరు ముందుకు వస్తారు,పైగా అందులో కొంత డబ్బు ఖర్చు పెట్టిన తమ భార్యలకు  ఇంకా మంచి కనుక  ఇవ్వచ్చు అని అభిప్రాయం తెలుపుతున్నారు.దీనివల్లే  భర్తలు ఎవ్వరు ఈ టూర్‌కు ఆసక్తి చూపలేదనే వదంతులు వినిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: