పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లోని బాలకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసి... దాదాపు 8 నెలలైంది. మళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్రమూకలు వచ్చి చేరాయి. ప్రస్తుతం అక్కడ 45-50 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నట్లు భారత నిఘావర్గాలు తేల్చాయి. వాళ్లంతా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాళ్లే. ఆ సంస్థ అక్కడో క్యాంప్ తెరిచింది. ఓ అంచనా ప్రకారం... ఆ ఉగ్రవాదులు అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. అంటే... వాళ్లు ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందుతున్నారన్నమాట. ఇదంతా దేనికంటే... భారత్‌లో ఆత్మాహుతి దాడులు చెయ్యడానికని తెలిసింది. ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు? వాళ్లకు ఎలాంటి టెక్నికల్ సాయం అందుతోంది? వంటి విషయాలపై మన నిఘావర్గాలు ఓ కన్నేసి ఉంచాయి.

ఇటీవల అక్కడి నుంచీ కొంత మంది టెర్రరిస్టులు... నిండా బాంబుల సంచులతో జమ్మూకాశ్మీర్ వైపు బయల్దేరారు. నిఘావర్గాలు వాళ్లను కనిపెడుతూ ఉన్నా... వాళ్లు రకరకాల మార్గాల ద్వారా వచ్చేందుకు యత్నిస్తున్నారు. వాళ్లంతా జమ్మూకాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడులు చేసేందుకే వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్.నిజానికి ఫిబ్రవరిలో బాలకోట్‌లో దాడులు చేసిన తర్వాత... దాదాపు 6 నెలల పాటూ ఆ ప్రాంతం సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత ఎక్కడి నుంచీ వచ్చారోగానీ... అక్కడే తిష్టవేశారు. రెండు నెలలుగా హార్డ్ కోర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఇక్కడ మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదులంటే ఇదివరకట్లా కాదు... ఇప్పుడు తయారవుతున్నవాళ్లంతా టాలా స్టైలిష్‌గా, మోడ్రన్ లుక్‌లో ఉంటున్నారు. అందువల్ల వాళ్లు మన మధ్యకు వచ్చినా... ఏమాత్రం గుర్తు పట్టలేం. వాళ్లు సంపాదించుకుంటున్న వెపన్స్ కూడా మోడ్రన్ టెక్నాలజీతో పనిచేసేవే. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లకుండా అలర్ట్ అవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: