మనలో చాల మంది తరచూ గుడికి వెళ్తుంటాం, గుడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉండే గంట కొట్టడం జరుగుతుంది. కానీ, గుడిలో గంట ఎందుకు కొడుతారో మీకు తెలుసా? ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి . దేవాలయం వెళ్ళినప్పుడు గంటకోడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక,సకల శుభాలు కలుగుతాయి. 

Related image

గంట విషయానికి వస్తే :  గంట నాలుక లో సరస్వతీ మాత కోలువై ఉంటుందట. గంట ఉదర భాగం లో మహా రుద్రుడు,బ్రహ్మ దేవుడు ముఖ భాగం లోను, కొన భాగం లో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రం గా భావించి దైవం గా పూజించాలి. గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని “కర్మ సిద్దాంతం” మనకు తెలుపుతుంది.
Image result for గంట ఎందుకు కొడతారు?
“హారతి” సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం. కొన్ని గుడుల్లో అలంకారం కోసం గంటలను ఉంచుతుంటారు..వాటి వల్ల ప్రయోజనం శూన్యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: