వినాయకుడికి ''వనమాల''
అలిపిరి వద్ద ఆకట్టుకుంటున్నవినాయక వనం: 300 చ.మీ విస్తీర్ణంలో  21 పవిత్ర మొక్కలు తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీగంధం, ఎర్రచందనం, ఔషధ మొక్కలతోపాటు భక్తులు పవిత్రంగా భావించే దేవతామొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే రాశివనం, నక్షత్రవనం, కార్తీకవనాలను అభివృద్ధి చేశామని, తాజాగా వినాయక వనాన్ని తీర్చిదిద్దామని డిఎఫ్‌వో శ్రీ శివరామ్‌ప్రసాద్‌ తెలిపారు. 


అలిపిరి రెండో ఘాట్‌లోని శ్రీ వినాయకస్వామివారి ఆలయం చెంత 300 చ.మీ విస్తీర్ణంలో వినాయక వనాన్ని పెంచారు. ఇందులో వినాయక పూజ కోసం వినియోగించే వివిధ ఫలాల మొక్కలు, పత్రాలు ఉన్నాయి. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి వినాయకుడిని దర్శించుకుని, వినాయకవనాన్ని తిలకించి వెళుతున్నారు.
 ఆగస్టు 25న వినాయక చవితి సందర్భంగా వినాయక వనం గురించిన విశేషాలు, మొక్కల సంస్కృత, శాస్త్రీయ, తెలుగునామాలు ఇలా  ఉన్నాయి.
సంస్కృత నామం,శాస్త్రీయ నామం,తెలుగు పేరు
1. అపమార్గపత్రం, అచిరాంతస్‌ ఆస్పెరా, ఉత్తరేణి
2. అర్జునపత్రం,
టెర్మినేలియ అర్జున, తెల్లమద్ది
3. అర్కపత్రం,
కాలోట్రోపిస్‌ ప్రోసెరా, తెల్లజిల్లేడు
4. అశ్వత్తపత్రం,
ఫైకస్‌ రెలిజియోస,రావి
5. బదరీపత్రం,
జిజిఫస్‌ జుజుబ, రేగు
6. బిల్వపత్రం,
ఏజిల్‌ మార్మలెస్‌ ,మారేడు
7. బృహతీపత్రం,
సోలనం ఇండికమ్‌, వంకుడు
8. చూతపత్రం,
మాంగిఫెరా ఇండిక, మామిడి
9. దడిమీపత్రం,
పునిక గ్రణతం, దానిమ్మ
10. దతూరపత్రం,
దతూర మెటల్‌,
ఉమ్మెత్త 
11. దేవదారుపత్రం,
సిడ్రస్‌ డిమోడొర,
దేవదారు
12. దూర్వార పత్రం,
సైనోడన్‌ డక్టిలాన్‌,
గరిక గడ్డి
13. ఆరె పత్రం,
బాహినియ పర్పేరియ, దేవకాంచనం
14. జాజి పత్రం,
జాస్మినం గ్రాండిపోరమ్‌ ,
జాజి
15. కరవీరపత్రం,
నేరియం ఇండికమ్‌,
గన్నేరు
16. మచీపత్రం ,
ఆర్టిమీసియా వల్గేరిస్‌ , మాచపత్రి
17. మరువాక పత్రం, ఒరిగానం వల్గరే,
మరువం
18. శమీ పత్రం ,
ప్రొసోపిస్‌ సినెరారియ, జమ్మి
19. సింధుధార పత్రం,
విటెక్స్‌ నిగుండో,
వావిలి
20. తులసి,
ఓసిమమ్‌ శాంక్టమ్‌,
తులసి
21. విష్ణుక్రాంతపత్రం, ఎవోల్వులస్‌ ఆల్సినోసిడిస్‌, విష్ణుక్రాంత


మరింత సమాచారం తెలుసుకోండి: