అక్షయ తృతీయ పండగ మన హిందువుల్లోనే కాకుండా జైనులలో కూడా చెపుకోతగ్గ పెద్ద పండగ. ఈ పండగ ముఖ్యముగా హిందువుల చంద్రమానకాల పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అనగా 2018 అక్షయ తృతీయని ఏప్రిల్ 18న జరుపుకొంటారని పండితులు చెబుతున్నారు.


అక్షయం అంటే? ::
వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతోంది. "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జనించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా నిశ్చితంగా జరుపుకోవచ్చు. అంతేకాదు.. వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.
Related image 
"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
 Image result for అక్షయ తృతీయ విశిష్టత
"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని అర్థం. ఆ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు. అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్నీ శుభకార్యాలను జరుపుకోవచ్చు. ఇంకా ఈ రోజున వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.

Image result for అక్షయ తృతీయ విశిష్టత

ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానంలో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహంపై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: