ప్రేమ, కరుణకు ప్రతీక అయిన ఏసుక్రీస్తు పుట్టిన రోజు క్రిస్ మస్ ను.. దేశవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చ్ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ…ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. క్రీస్తును ఆరాధిస్తూ కళాకారులు పాడుతున్న పాటలతో.. చర్చిల్లో సందడి కనిపిస్తోంది. క్రిస్ మస్ సంబరాలకు దేశం ముస్తాబైంది. నగరాల్లో, గ్రామాల్లో క్రిస్ మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. శాంటాక్లాజ్ లు, క్రిస్ మస్ ట్రీలతో సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి.

Image result for క్రిస్ మస్

క్రిస్ మస్ షాపింగ్ తో మార్కెట్ లు కిటకిటలాడుతున్నాయి... అటు పవిత్ర వారణాసిలో శాంటాక్లాజ్ లు సందడి చేశారు.  పాపం చేసిన వాళ్లనూ క్షమించడం క్రీస్తు తత్వంలోని గొప్పదనం. అలాంటి ఏసు క్రీస్తు పుట్టిన రోజే క్రిస్ మస్. త్యాగం, సహనాలే కాదు…ప్రజలంతా ఒకరికొకరు ప్రేమ, కరుణలు పంచాలన్న సందేశాన్ని ఇచ్చే ఈ పండగ.. దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. మహిమాన్వితమైన క్రీస్తు బోధలతో చర్చ్ లలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. బెంగళూరులో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.

Image result for క్రిస్ మస్

చర్చిలనం విద్యుద్దీపాలతో డెకరేట్ చేశారు. చిన్నా పెద్దా అంతా కలిసి క్రిస్ మస్ ప్రేయర్లు చేస్తున్నారు. ఒకరికొకరు హ్యాపీ క్రిస్ మస్ చెప్పుకొంటూ సందడి చేస్తున్నారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో క్రిస్ మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. స్పెషల్ డెకరేషన్ తో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్ మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 

Image result for క్రిస్ మస్

డివోటీస్, విజిటర్స్ ను ఆకట్టుకునేలా.. చర్చిని అందంగా డెకరేట్ చేశారు. దేశవ్యాప్తంగా అర్థరాత్రి నుంచే క్రిస్ మస్ హోలీ ఫీస్ట్ సంబరాలు మొదలయ్యాయి.  రంగురంగుల లైట్లతో… ప్రత్యేక అలంకరణలతో చర్చిలన్నీ మెరిసిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: