రాజస్థాన్‌లోని సుందరమైన ప్రదేశం... బికనీర్‌ నుంచి జైసల్మేర్‌ వెళ్లే రహదారి. చిన్న చిన్న గ్రామాలు.. ఓ మోస్తరు పట్టణాలు.. ఇసుక దిబ్బలు.. ఎండమావులు.. వింతగా ఉంటుంది. ఈ దారిలో వింత వింత పేర్లున్న ఊళ్లు కూడా దర్శనమిస్తాయి. బాప్‌, చాచా.. ఇవి ఊళ్ల పేర్లే. ఇదే దారిలో ఉండే మరో గ్రామం హాత్మ.

హాత్మ.. ఇదేం పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా.. పేరే కాదు.. విశేషాలు గురించితెలిస్తే .. షాక్ కు గురవుతారు.  హాత్మ.. ఈ ప్రదేశం గురించి  అక్కడి వారిని అడిగితె.. భయంతో వణికిపోతారు.   అసలు ఇంతకీ హాత్మ లో ఏముంది.  ఎందుకని అక్కడి ప్రజలు అలా వణికిపోతున్నారు.  తెలుసుకుందాం. 


హాత్మ.. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఇక్కడ కిరాడు అనే పేరుతో కూడిన ఐదు దేవాలయాలు ఉన్నాయి.  అందులో నాలుగు శివాలయాలు కాగా,, ఒకటి వైష్టవాలయం.  ఈ దేవాలయాల్లో ఉదయం అంతా సందడిగా ఉంటుంది.  సూర్యాస్తమయం నుంచి భయానకంగా మారుతుంది. 


సూర్యుడు అస్తమించగానే భక్తులు, పూజారులు అంతా అక్కడినుంచి వెళ్ళిపోతారు.  ఒక్కరు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడరు.  దీనికి ఓ కారణం ఉందట.  బాగా చీకటి పడిన తరువాత.. దేవాలయంలో నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వంటివి వినిపిస్తాయట.  ఈ రకమైన అరుపులు తెల్లవారే వరకు ఉంటాయని వినికిడి.  ఈ కేకలకు భయపడి ఎవరు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడరు.  ఒకవేళ ఎవరైనా సాహసించి.. ఆ గుళ్లో ఉంటె.. తెల్లారేసరికి వారు కనిపించరు.  


రాత్రంతా గుళ్లో ఉంటె.. తెల్లారే సరికి రాళ్ళలా మారిపోతారని హాత్మ గ్రామ ప్రజలు చెప్తుంటారు.  ఇలా ఎన్నోసార్లు జరిగిందని అక్కడి ప్రజలు చెప్తుంటారు.  అందుకే రాత్రివేళల్లో అక్కడ ఉండొద్దని హెచ్చరిస్తారట.   ఇది ఎంతవరకు నిజమో తెలియదుకాని, ఈ వార్తా దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. కిరాడు దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: