విద్యార్థులు చిన్న వయసు నుండి పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానం కలుగుతుందని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలు నానాటికీ కనుమరుగైతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారు ఒక మంచి పని చేశారు. వారి మొత్తం ప్రచురించిన అన్ని పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET లో అందు బాటు లోకి తెచ్చారు.

వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు .  మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం. సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు.

తెలుగు వారి సనాతన ధర్మాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు విదేశాల వారికి ఎంతగానో నచ్చుతాయి..కానీ స్వదేశంలో ఉన్న మనమే వాటిని విస్మరిస్తే..కొన్నాళ్లకు ఇలాంటివి చెప్పుకోవడానికే తప్ప కంటికి కనిపించవని వేదశాస్త్ర పండితులు అంటున్నారు. ఈ తరం వారికి ఆద్యాత్మిక చింతన కొంతైనా అలవాటు చేయించడం తల్లిదండ్రుల కర్తవ్యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: