ఆంధ్ర ప్రదేశ్  రాష్టంలోని విజయవాడలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రిలో  కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో విజయ దశమి మహోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దసరా మహోత్సవాలు 2019 ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు.  ఆదివారం సాయంత్రం దేవస్థానం దసరా మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. విజయవాడలోని బ్రాహ్మణ వీధిలో గల తన క్యాంప్  కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి వెలంపల్లి దేవస్థాన అధికారులతో  మీడియాతో మాట్లాడారు. 



దుర్గ గుడిలో ఏటా కన్నుల పండుగగా జరిగే దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి  భక్తులు తరలి వస్తారు. ఆ విధంగా  వచ్చు ప్రతి భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారని మంత్రి శ్రీనివాస రావు తెలిపారు. అదే విధంగా  అమ్మవారి దర్శనము త్వరితగతిన కలిగే లాగా అన్ని శాఖల సమన్వయముతో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టు మంత్రి  తెలిపారు. శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతి దేవి రూపములో దర్శనము ఇవ్వనున్న సందర్బంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.



అక్టోబర్ 5 వ తేదీన  మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని  రాష్ట్ర ప్రభుత్వం తరపున  రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ కనక దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించనున్నట్టు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, ఆలయ ప్రధానార్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాస శాస్త్రి , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు ఎన్.రమేష్ గారు,  బి.వెంకటరెడ్డి, తిరుమలేశ్వర రావు, పర్యవేక్షకులు, పి.ఆర్.ఓ. కే.బలరామకృష్ణ ,లతో పాటుగా పలువురు అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: