శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి వాతావరణ ప్రభావాన్ని పరిశీలిస్తే.. తిరుమల 20C°- 28℃° మధ్య ఉష్ణోగ్రత ఉంది. ఈ నేపథ్యంలో నిన్న 76,518 మంది  భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని  26 గదులలో భక్తులు చేచియున్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటలు పట్టవచ్చును. 
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.82 కోట్లు. నిన్న 28,188 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శీఘ్రసర్వదర్శనం(ఎస్ ఎస్ డి),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ 300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును. వయోవృద్దులు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా  ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750), మ: 2 గంటలకి (750) ఇస్తారు.



చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు: 30 న మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి,  సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం, రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము. అక్టోబర్ 1 వ తేదీన ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము,  రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము.




2 న  ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము. 3 న   ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము.  రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము. 4 న  ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం. రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము. 5 న ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము. 6 న  ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము. రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము. 7 న ఉదయం 7గంటల నుండి రధోత్సవము, రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము. 8 న  ఉదయం 6గంటల నుండి చక్రస్నానము. రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము. 


మరింత సమాచారం తెలుసుకోండి: