శరన్నవరాత్రోత్సవాలకు  ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనక దుర్గ అమ్మవారి దర్శనార్దం 18 లక్షల మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు,  జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కె. కన్నబాబులు తెలిపారు. శుక్రవారం విజయవాడ దుర్గ గుడిపై జరుగుతున్నదసరా ఉత్సవాల ఏర్పాట్లను  మంత్రులు వెలంపల్లి, కన్నబాబులు పర్యవేక్షించారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడారు.  ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పదిరోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.



దసరాలో అమ్మవారి దర్శనార్ధం ఇంటి నుంచి వచ్చే భక్తులు మరల అమ్మవారి దర్శనాంతరం ఇళ్ళకు సజావుగా వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దసరా ఉత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు అధికారులను సిద్ధం చేశామని చెప్పారు. మోడల్ గెస్ట్ హౌస్ట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని మంత్రులు వెల్లంపల్లి, కన్నబాబులు తెలిపారు. సిసి కెమేరాల ద్వారా నిఘా పటిష్టం చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రతిరోజు ఉత్సవాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. విఐపిలను కుదించి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. 




క్యూలైన్ల లో ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు, పాలు ఇతరత్రా పంపిణి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం  మొక్కలు నాటి హోర్డింగ్ ల పేరుతో డబ్బులు దండుకున్నారని మంత్రులు ఆరోపించారు. ప్రతి రూపాయి భక్తులకే చెందాలన్నారు. ఉత్సవాలకు దుర్గ గుడి పెట్టె ఖర్చుకు అదనంగా  మిగతా ఖర్చు అంతా ప్రభుత్వం పెడుతుందని చెప్పారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే  దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు శ్రీవాసరావు, కన్నబాబులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: