దసరా పండుగ వచ్చిందంటే చాలు ఆ రోజంతా ఎదో  తెలియని తేజస్సు , సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని, మన కుటుంభాలు బాగుండాలని కోరుకుంటాము. అదే రోజు పాలపిట్ట ని చూస్తే విజయం చేకూరుతుంది. ఎటువంటి పని చేసినా సఫలం అవుతుందనేది నమ్మకంగా ఆదిగా వస్తున్న సాంప్రదాయం. అసలు దసరా కి పాలపిట్టకి మధ్య ఉన్న సంభంధం ఏమిటి..?? కేవలం ఆ పక్షిని చూస్తేనే ఎందుకు విజయం చేకూరుతుంది...??

 

పాలపిట్ట దేవీ స్వరూపంగా పూజిస్తారు. పూర్వం నుంచీ ఈ పద్దతి కొనసాగుతోంది. ఉత్తరం నుంచీ ఈ పక్షి వస్తే శుభం చేకూరుతుందని, దక్షిణం నుంచీ వస్తే అంత మంచిది కాదనేది నానుడి. ముఖ్యంగా ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాలో ఒకటైన తెలంగాణలో ఎక్కువగా కన్పిస్తుంది. తెలంగాణాలో దసరా రోజున పాలపిట్టని తప్పకుండా చూస్తారు. అలా చూడటం ఎందుకనంటే అందుకు ప్రాచుర్యంలో ఉన్న ఓ కధ ని చెప్తారు. అదేంటంటే.

 

పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని వస్తుండగా పాలపిట్ట కనపడిందట. ఆ తరువాతే కౌరవుల నుంచీ పాండవులు తమ రాజ్యాన్ని దక్కించుకోవడం జరిగిందని. ఎన్నో విజయాలు పాండవులు పొందారని అప్పటి నుంచీ దసరా రోజున తప్పకుండా పోలాలోకి వెళ్లి మరీ పాలపిట్టలని చూసేవారాని తెలుస్తోంది. ఇది అసలు స్టొరీ. అయితే

 

ఈ పాపిట్టలు మనవ తప్పిదాల వలన అంతరించి పోతున్నాయి. దాంతో తెలంగాణాలో దసరా రోజున పాలపిట్టలని బోనుల్లో బంధించి మరీ వీధి వీధి తిప్పుతూ వాటిని జనాలకి చూపించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది తారస పడుతారు. ఈ క్రమంలోనే ఎంతో మంది జంతు ప్రేమికులు ప్రభుత్వానికి ఈ పరిస్థతిని వివరించి పాలపిట్టలని భంధించే విధానాన్ని నిషేధించాలని కోరడంతో గతంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుని ఆ పక్షులని భంధించే వారిపై చర్యలు తీసుకోవాలని, వాటిని అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: