దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.  ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. దసరా నవరాత్రుల్లో... దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం.  ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి.


వాస్త‌వానికి దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం అజ్ఞాత వాసమము తో కలిపి పూర్తిచేసిన రోజు, అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు, జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి.


దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది. ఇక ఈ పండగను ముఖ్యంగా కర్నాటకలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. భార‌త దేశంలోనే కాకుండా  నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు జ‌ర‌గ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: