ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు గల సమయములో తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజు దసరా అని అంటారు. జగన్మాత అయిన దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురున్ని వధించి విజయం పొందిన సందర్భంగా పదవ రోజున ప్రజలు అందరూ సంతోషంతో విజయదశమి పండుగను జరుపుకుంటారు. 
 
దసరా పండుగ రోజున పాలపిట్టను వీలైతే తప్పకుండా చూడాలి. పాలపిట్టను చూసిన వారికి విజయాలు మరియు శుభాలు కలుగుతాయి. విజయదశమి రోజున ఈ పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా మరియు శుభసూచికంగా భావించవచ్చు. విజయదశమి రోజున ఈ పిట్టను ఛుస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుందనే నమ్మకం ఉంది. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. 
 
దసరా పండుగ రోజున పాండవులు అజ్ఞాత అరణ్య వాసాలను పూర్తి చేసుకొని వారి రాజ్యాలకు తిరిగివచ్చే సమయంలో పాండవులకు ఒక పాలపిట్ట కనపడింది. ఆ పాలపిట్టను చూసిన పాండవులు ఆ తరువాత ఏ పనులు చేపట్టినా ఆ పనుల్లో విజయాలు సాధించారు. అప్పటినుండి విజయదశమి రోజున పాలపిట్టను దర్శనం చేసుకొంటే శుభాలు కలుగుతాయనే నమ్మకం ప్రజలలో ఏర్పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: