తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలకు....శ్రీశైలంలో రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్న భ్రమరాంబను దర్శించుకుని భక్తులు తన్మయులవుతున్నారు.  అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రమంతటా ప్రతి మోములోనూ దసరా సంబరం శోభిల్లుతోంది. ఊరూరా, వాడవాడలా దుర్గాదేవి విగ్రహాలు ఏర్పాటు చేసి, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తు.... చిన్నా పెద్దా అంతా దసరా వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత్త బట్టలు, ఆభరణాలు, గృహోపకరణాలు, వాహనాల కొనుగోలుదారులతో మార్కెట్‌లు కిటకిటలాడుతున్నాయి.


 ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం ప్రజలకు ఊరటనిచ్చింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ల పెంపుపై వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్‌ను దశల వారీగా ఈ ఏడాది తొలి దశ కింద పింఛన్‌ను రూ.2,250కు పెంచుతూ  తొలి సంతకం చేశారు.  అలాగే వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ప్రకటించారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు... ఇలా వివిధ వర్గాల ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడం ద్వారా కొత్తచరిత్రకు నాంది పలికారు. 


ఆటో, ట్యాక్సీ కార్మికులకు ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసే పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు. అర్హులైన అందరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు.  రూ.1,000 దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం పేదలకు ఆరోగ్య రక్షణ కల్పించింది.దేశంలోనే మొదటిసారి ఒకేసారి  4 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించారు.  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో చేసి 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేశారు.

 ఇక 2.68 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారు. ఇకపై ప్రతిఏటా జనవరిలో రిక్రూట్‌మెంట్‌ క్యాలండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో  యువతలో నవోత్సాహం  నెలకొంది మరోపక్క మధ్యం నిషేదం హామీ ని దశల వారీగా మద్యం దుకాణాలను ఎత్తివేస్తూ....  ప్రభుత్వ బెల్టు షాపుల ద్వారా మరికొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మద్యం సరఫరా తగ్గించారు. ఈ విధంగా ఈ దసరా పండుగ తమకు నిజమైన ఆనందాన్ని తెచ్చిందని అటు రాజకీయ నాయకులూ...ప్రజలు చెబుతుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: