మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ఎంతో ప్రసిద్ధి చెందారు. శ్రీశైలం కర్నూలు జిల్లా కి  తూర్పులో  ఉంది పచ్చని నల్లమల్ల అడవుల్లో మధ్యలో కృష్ణమ్మ ఒడ్డున ఉన్న శ్రీశైలం అందం చూడదగినది. శ్రీశైలం లో వెలసిన మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగం లో ఒకరు అలాగే భ్రమరాంబ గారు శక్తిపీఠాలలో ఒకరుగా విరాజిలుతున్నారు .

శ్రీశైలం ని మరింతగా అందుబాటులోకి తెచ్చే విధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక కొత్త ప్యాకేజీని ఏర్పాటు చేశారు ఈ ప్యాకేజీలో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు బస్సు యాత్ర ఉంటుంది .ఈ ప్యాకేజీలో దారి మధ్యలో ఉన్న త్రిపురాంతకం, కోటప్పకొండ దర్శనం దర్శిస్తూ ఈ యాత్ర  సాగుతూ ఉంటుందని తెలియజేశారు

. ఈ ప్యాకేజీ ఈనెల 12వ తారీఖున  ప్రారంభమైంది మొదటిరోజు 18 మంది యాత్రికులు వచ్చారు వారు వచ్చిన వెంటనే శ్రీశైలం టూరిజం శాఖ అతిథి గృహాలలో స్నానాదికాలు ముగించారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు భోజనం చేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు.తిరుగు ప్రయాణం లో త్రిపురాంతకం మరియు కోటప్పకొండ కూడా చూసారు .   చాలా ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు టూరిజం శాఖ నూతనంగా మొదలుపెట్టిన ప్యాకేజి చాలా బాగుందని చెప్పారు ఒకేసారి మూడు క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలిగింది అన్నారు .

ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం 5 గంటలకు విజయవాడలో బస్సు బయలు దేరి శ్రీశైలం వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తరువాత త్రిపురాంతకం అక్కడి నుండి కోటప్పకొండ దర్శించుకుని తిరిగి అదే రోజు రాత్రి పదిన్నర గంటలకు విజయవాడ తీసుకెళ్తున్నారు. ఈ టూరిజం బస్సు ప్రతి శని మరియు ఆదివారం లో మాత్రమే ఉంటుందని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: