దీపావళి సందర్బంగా పాఠకులకు కోసం అందిస్తున్న మరొక వంటకం. ఈ రోజు మనం ఇంట్లో శనగపప్పు వడలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు బయట కొన్నుకుండే వాటిని మన చేతులతో చేసి ఇంట్లో వాళ్లకు వండి వార్చడం ద్వారా చాల అందాన్ని పొందవచ్చు. ఇక ఆలు విషయానికి వెళితే ఈ  శనగపప్పు వడలు ఎలా తాయారు చేసుకోవాలో ఇక్కడ ఒక లుక్ వేయండి.


ముందు ఈ వంటకానికి కావలిసిన ముడి పదార్ధాల గురించి చుద్దాం. ఇప్పుడు కావలసిన పదార్థాల విషయానికి వస్తే పచ్చి శనగపప్పు - పావుకిలో, నూనె – అరకిలో, ఉల్లిపాయలు – 4, పచ్చిమిర్చి – 6, జీలకర్ర – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత పదార్థాలు తీసుకోవాలిసి ఉంటాయి. ఇలా అన్ని రెడీ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు వీటి తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాము. ముందుగా శనగపప్పును బాగా నానబెట్టాలి.

ఇలా  నానబెట్టిన శనగపప్పును కడిగి పెట్టుకొవాలి. అందులోంచి ఒక చేతి గుప్పెడు పప్పు తీసి ఉంచి, మిగిలినదానికి తగినంత ఉప్పువేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన ఉంచిన శనగపప్పు, జీలకర్ర బాగా కలపాలి.


తరువాత ఒక బాణలిలో నూనె కాగనిచ్చి, నిమ్మకాయంత ఉండలు చేసి, పాలిథిన్ కవర్ పై వడలు వత్తి, ఎర్రగా కాస్త క్రిస్పీగా వేయించుకోవాలి. పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేస్తే, శనగపప్పు వడలు మరింత రుచిగా వస్తాయి. నంజుకోడానికి అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, శనగపప్పు, కొబ్బరి పచ్చడి  ఏదైనా కూడా బాగుంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం సరుకులు వెళ్లి తెచ్చుకొని మొదలు పెట్టుకొని వేడి వేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: