ప్రపంచ వ్యాప్తంగా పండుగలకు, వేడుకలకు, రాజకీయ నాయకుల సంబరాలకు విరివిగా బాణాసంచా కాల్చుతూ ఉంటారు. కానీ పర్యావరణ పరిరక్షణ గురించి, శబ్ద కాలుష్యం గురించి ఎవరు పట్టించుకోరు. కానీ దీపావళి రాగానే అందరికి పర్యావరణం మీద ప్రేమ పెరిగిపోతుంది. సుప్రీంకోర్టులు, పర్యావరణ ప్రేమికులు,కాలుష్య నియంత్రణ మండలి కేవలం ఈ ఒక్క దీపావళి కి ముందు నుండి మాత్రమే బాణాసంచా యొక్క ప్రమాదం, కాలుష్యం గురించి ఎక్కువగా అవగానే తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు.


ఎందుకంటె  ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే దివ్వెల పండుగ, దీపాలు వెలిగించి  చీకట్లు తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకునే పండుగ. కానీ దీపావళి జరుపుకునే విధానంలో ప్రజల ఆలోచనా ధోరణి క్రమంగా మారుతూ వస్తోంది.దీపావళిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాధి సాగిస్తుంటాయి. ఈ ఒక్కరోజు కోసమే ఏడాది పొడవునా ఎదురుచూసే కుటుంబాలు ఉన్నాయి.  అందుకే ఆనంద దీపావళి.. ఇదీ మనందరీ లక్ష్యంగా ఈనెల 5 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు మొదలయ్యాయి.

దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌చే తయారు చేసిన బాణసంచా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం పర్యావరణానికి..జీవ వైవిధ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పెట్రోలియం, మందుగుండు సామగ్రి భద్రతా సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్స్‌ (సీఎస్‌ఐఆర్‌) సంస్థ ద్వారా పర్యావరణహిత బాణాసంచా రూపకల్పన చేయించింది. కాలుష్యం ఎక్కువగా ఉండే మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం, స్ట్రోనియం అల్యూమినియం, బేడియం వాడిన బాణసంచా  బదులు  ప్రమిదలతో కూడిన వెలుగులు మేలు.

పెద్ద శబ్దాలొచ్చే బాణా సంచా కాల్చాలనే కుతూహలం పిల్లల్లో ఉంటుంది. అందుకే బాణా సంచా ఎంపికలో వయసుల వారీగా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ► 3 నుంచి 5 ఏళ్ల వారికి – రంగుల అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, తాళ్లు
► 6 నుంచి 12 ఏళ్ల వారికి – పెన్సిళ్లు, తాళ్లు, వెన్నముద్దలు, కాకరొత్తులు, భూచక్రాలు, పిస్తోళ్లు
►13 నుంచి 21 ఏళ్లవారికి – హైడ్రోజన్, బర్డ్స్, లక్ష్మీ, బుల్లెట్‌ బాంబులు, యాలీయాలీ టపాసులు, తాజ్, రెడ్‌ఫోర్డ్‌ బాంబులు
► 21 ఏళ్లకు పైబడిన వారికి   చిచ్చుబుడ్లు, రంగుల ఫౌంటెన్లు, క్రాకర్‌ కింగ్స్, రాకె ట్లు, లక్ష్మీబాంబులు, రెడ్‌పోర్డు బాంబులు, డబుల్‌ సెవెన్స్‌ ఏకే 47, స్పీడ్‌ 2000, బుల్లెట్‌ ట్రైన్స్, గ్రాఫిక్‌ 180 తదితరాలు
► మహిళలకు – సింగిల్‌ సెల్స్, క్లాసిక్, స్ల్విర్‌ షవర్స్, స్టార్‌వార్స్, మూన్‌లైట్, రంగ్‌మేళా  తదితర టపాసులు


మరింత సమాచారం తెలుసుకోండి: