దీపావళి పండుగ సందర్బంగా పాఠకులకు కోసం అందిస్తున్న మరొక వంటకం. ఈ రోజు మనం ఇంట్లో జాంగ్రీ తయారీ విధానం  తెలుసుకుందాం మరి. ఎల్లపుడు బయట కొన్నుకుండే వాటిని మన చేతులతో చేసి ఇంట్లో వాళ్లకు వండి వార్చడం ద్వారా చాల అందాన్ని మనం పొందవచ్చు. ఇక అసలు విషయానికి వెళితే ఈ  జాంగ్రీ ఎలా తాయారు చేసుకోవాలో చూద్దామా ఇంకా...


జాంగ్రీ తయారుకి  కావలసిన ముడి పదార్థములు విషయానికి వస్తే ఒక కిలో మినప్పప్పు,  అర కిలో నెయ్యి , అరకిలో  డాల్డా, రెండు కిలోలు  పంచదార, 100 గ్రాములు బియ్యము  కావాల్సి ఉంటుంది. ఇక తయారు చేయు విధానానికి వస్తే మినప్పప్పు, బియ్యము ఒక పెద్ద పాత్రలో తీసుకుని నీటితో రెండుసార్లు శుభ్రంగా కడగ వలయును. తరువాత నీటిలో ఐదారు గంటలు నానబెట్టాలి. పిదప మినప్పప్పు బియ్యం మెత్తగా రుబ్బాలి. లేకపోతే మెత్తగా గ్రైండ్ చేయాలి.తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నెయ్యి పోసి బాగా కాగనివ్వాలి.ఈలోగా ఒక మెత్తని బట్టను తీసుకొని దానికి సన్నని రంధ్రం చేసి మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని బట్టలు వేసి కాగిన నూనె బాణలిలో వేయాలి.  ఈ పిండిని జంతికలు జిలేబి చేసినట్టే పిండిని నూనెలో వేయాలి.


నెయ్యిలో వేసిన చుట్టలను బాగా వేగనివ్వాలి. కొంచెం గోధుమ వర్ణం వచ్చేవరకు వేగనివ్వాలి. మరి ఒక పెద్ద పాత్రలో పంచదారను తీసుకొని తీగపాకం వచ్చేవరకు చూసుకోవాలి. ఈ పంచదార తీగపాకం లో కొంచెం మిఠాయిరంగు వేసి బాగా కలప వలయును. అప్పుడు మనకు మంచి రంగు కనిపిస్తుంది. 


ఇప్పుడు పంచదార పాకంలో నెయ్యిలో వేయించిన జాంగ్రీలను పాకంలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత జాంగ్రీలను పాకములో నుంచి తీసి ఒక పెద్ద పళ్లెములో అందముగా అమర్చాలి. ఈ జాంగ్రీలు నోట్లో వేసుకుంటే చాలా మెత్తగా కరిగిపోతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన వంటకము. చాలామంది పెళ్లిళ్లలో జాంగ్రీ స్వీట్ నే పెడతారు. శ్రీమంతం పేరంటంలో ఎర్ర రంగు చీర కట్టి నప్పుడు జాంగ్రీ స్వీట్ నే సార గా పెడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: