దీపావళి రాగానే పర్యావణ పరిరక్షణ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలెడతారు."విజ్ఞాన ప్రదర్శన" పేరుతో కానీ ఈ ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం చెవికెక్కించుకోవట్లేదు. హిందూ పండుగలను  మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి అంటూ ఎంతో నమ్మకంగా జరుపుకుంటారు.  ప్రతి హిందు పండుగకు ఒక శాస్ర్తీయత ఉంటుంది" ఏ కారణం, నమ్మకం లేకుండా ఏ పండుగను జరుపుకోరు. అటువంటిది దీపావళిని ఒక పర్యావరణ భూతం గా చూపిస్తున్నారు. అదే ఎందుకని దీపావళి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు 


కుల, మతాలకు అతీతంగా బాణాసంచా తయారీతో 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి టపాసులను పొల్యూషన్ అని చాల మంది ఒప్పోకోవట్లేదు. ఏంటో జనం ఒక్కరోజు దీపావళి అంటే కాలుష్యం కాలుష్యం అంటున్నారు. కానీ ఏడాది పొడవునా కాలుష్యాన్ని వెధచల్లే వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. పొల్యూషన్ ఆపాలంటే మీ కార్ అమ్మేసి సైకిల్ కొనుక్కొండి,  బైక్ అమ్మేసి నడుచుకుంటూ పొండి. ఫ్యాక్టరీలు తీసేసి కార్మికులకి ఉపాధివ్వండి. షాపింగ్కెళ్లి కవర్ లో కాకుండా బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రండి.
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి సొరకాయ, పొట్లకాయ, వంకాయలు, మిరపకాయలు పండించి తినండి.

క్యారీబాగ్ వద్దు, సెల్ ఫోన్ వాడకండి, పిట్టలు చచ్చిపోతున్నాయ్. కరెంట్ బహిష్కరించండి షాక్ కొట్టి గబ్బిలలాలూ, కాకులు కాలిపోతున్నాయి. బల్బు వాడకండి..పురుగులు చచ్చిపోతాయ్. చచ్చినప్పుడు శవం ముందు, పెళ్ళైనప్పుడు జంట ముందు టపాసులు పేల్చడం మానెయ్యండి. ఫ్యాన్ ఉందిగా ఏసీ ఎందుకు...? కుండ ఉందిగా.... ఫ్రిజ్ ఎందుకు?  ఇవన్నీ మనిషి నిత్యా అవసరాలే ఐన కాలుష్యంకారకాలు. వీటి మీద ద్రుష్టి సారించని వాళ్ల్లు ఒక్క దీపావళి కె ఎందుకు ఈ వివక్ష అంటూ దీపావళి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. నిజమే వారు చెప్పేది. ఏడాదిలో ఒకరోజు కాలుష్యాన్ని ఆపడం కాదు మనిషిగా ప్రకృతిని ప్రేమించే వారు నిత్య జీవితంలో కాలుష్య రహితంగా బ్రతటానికి ప్రయత్నించాలి.


అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వర్షఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయని నానుడి.  "దీపావళి టపాసులు కాల్చినందువలన భాస్వరం కాలుతుంది తద్వారా వచ్చే వాయువులు క్రిమి కీటకాలను నశింపచేసి ఇంటి పరిసరాలను రక్షిస్తుంది. ఇలా ఎందరో హిందువులు గొప్పగా, గౌరవంగా, నమ్మకంగా జరుపుకుంటున్న పండుగే దీపావళి.  కార్తీకమాసపు రుగ్మతలు నుండి కాపాడుతుంది. కార్తీక దీపాలతో వాడే ఆవునెయ్యు, నువ్వుల నూనె గాలిలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: