మనిప్లాంట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ మనీప్లాంట్ బాగా పెరిగితే బాగా మనీ వస్తుంది అని లేకుంటే ఇంట్లో డబ్బు అనేది నిలవదు అని అందరూ అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ మనీప్లాంట్ కు అదృష్టం తెచ్చే మొక్కగా పేరు ఉంది. మంచి ఫలితాలను ఇచ్చి ఇంట్లోని వారందరికి శక్తిని, అదృష్టాన్ని ఇస్తుందని చెప్తున్నారు. 


కాగా ఇంట్లోని గాలిని సైతం ఈ మొక్క శుభ్రపరుస్తుంది. తక్కువ సమయంలో పెద్దగా పెరిగే ఈ మొక్క వెలుతురు లేని చోట కూడా పెరుగుతుంది. నున్నని ఆకుపచ్చని ఆకులు, సున్నితమైన తీగలతో వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడ బడితే అక్కడ పెంచకూడదని, మంచి ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభ ఫలితాలనిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఆ నియమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ఇవీ మనీ ప్లాంట్ నియమాలు.. 


ఈ మనీ ప్లాంట్ ని వీలునుబట్టి కుండీ లేదా సీసాల్లోనూ పెంచుకోవచ్చు. అయితే రోజూ ఈ మనీ ప్లాంట్ కు నీరు పోయాలి.


ఈ మనీ ప్లాంట్ కు ఎండిన, పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తొలిగిస్తు ఉండాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.


గణేశుని స్థానమైన ఇంటి ఆగ్నేయ మూలన ఈ మొక్కను ఉంచితే అన్నివిధాలా శుభాలు జరుగుతాయి.


ఈ మొక్కను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచకూడద. దీనివల్ల ధన నష్టంతో పాటు ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. 


ఈ నియమాలను పాటించి ఈ మొక్కను పెంచితే ఆ ఇంట్లో వారికీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: