'చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి..' అంటూ పాట రూపంలో ఆత్రేయ గారు దీపావళి గురించి చాల చక్కగా వర్ణించారు.. అజ్ఞానాంధకారాన్ని., అమావాస్య చీకట్లను., తరిమి కొడుతూ వెలిగించే దీపాలలో దాగిన అర్ధాలేన్నో.. ఈ దీపావళి పండుగ రోజు చేసే లక్ష్మీ పూజ ఒక ప్రత్యేకం అయితే అక్టోబర్25న జరుపుకునే 'అక్షయ తృతీయ' మరో ప్రత్యేకం.. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ సిరి సంపదల వృద్ధి కోసం ఈ అక్షయ తృతీయ నాడు కనీసం గ్రాము బంగారమైనా కొనడం అనాధిగా వస్తున్న ఆచారం..

 

 

పొగడ్తలు పడని ఆడవారు ఉంటారేమో కానీ బంగారం నచ్చని ఆడవారు మాత్రం మన దేశంలో లేరనే చెప్పుకోవాలి.. అలా అని మెరిసిన ప్రతీది బంగారం కాదు. అయితే బంగారం ధర ఆకాశాన్ని అందుకున్నా సరే కొనడానికి వెనుకాడని ఆడవారు మాత్రం ఖచ్చితంగా బంగారం కొనే విషయంలో కొన్ని సూచనలు పాటించి తీరాలి.. అందులో భాగంగా మొదటి ఐదు సూచనలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

1) అసలు మీరు కొంటున్న బంగారం లో ఎంత నాణ్యత ఉందో తెలుకోవడానికి మీ బంగారం విలువ ఎన్ని క్యారెట్లో చూడండి. 99.9% నాణ్యమైన బంగారం విలువ 24 క్యారెట్లుగా., 92% నాణ్యమైన బంగారం 22 క్యారెట్లలో సూచిస్తారు. ఇలా 14, 18, 22, 24 క్యారెట్ లలో బంగారం ఉంటుంది చూసి తీసుకోండి..

 

2) ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు బి.ఐ.ఎస్. హాల్ మార్క్. కొనుగోలు దారునికి స్వచ్ఛమైన., నాణ్యమైన సేవలను అందించే భాగంగా ఈ హాల్ మార్క్ గుర్తును ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు కొనే వస్తువు మీద ఈ గుర్తు ఉందో లేదో ఖచ్చితంగా చూడండి..

 

3) మీరు కొనబోయే వస్తువు ధర., మీరు తీస్కునే సమయానికి ఎంత వుందో తెలుసుకొని తీస్కోండి. ఉదాహరణకు మీరు కొనే 24క్యారెట్ల బంగారం ధర 40వేలు., 22 క్యారెట్ల బంగారం ధర 35వేలు ఉన్నట్టయితే మీకు పడే విలువ ఎంతో తెలుసుకొని తీస్కోండి..

 

4) ఎదైనా బంగారు వస్తువు మీరు కొన్నట్టయితే ఆ వస్తువుకి పడిన ధరతో పాటు అసలు ఆ వస్తువు తయారైనందుకు పడిన మేకింగ్ ఛార్జిలు ఎంతో ముందుగా అడిగి తెలుసుకోండి.. లేకపోతే తరుగు కింద మీరు డబ్బు నష్టపోయే ప్రమాదం వుంది..

 

5) ఒకవేళ మీరు కొనే వస్తువులో రాళ్ళు పొడిగి వుంటే వాటి క్వాలిటీ తో పాటు ధరను కూడా పరిశీలించండి.. ఎందుకంటే ఈ మధ్య సాధారణ సి.జెడ్ రాళ్లను వస్తు తయారీలో వాడి ధరలు మాత్రం విలువైన నవరత్నాల స్థాయిలో వసూలు చేస్తున్నారు.. 

 

కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు ఖర్చుచేసే ప్రతీ రూపాయికి న్యాయం పొందండి.. ఈ అక్షయ తృతీయను మరింత ఆనందంగా మార్చుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: