భారతీయులు జరుపుకొనే ముఖ్య పండుగలలో దీపావళి అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు జరుపుకుంటారు. పూర్వము నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అంటే చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. 


దీపావళి పండుగ ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసమున అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీనినే మనము నరక చతుర్దశి పండుగగా జరుపుకుంటున్నాము. దీపము పరబ్రహ్మ స్వరూపము అని పురాణాలు చెప్పుచున్నవి. అజ్ఞానము అనే చీకట్లను తొలగించి జ్ఞాన దీపము వెలిగించేది దీపము. నరక చతుర్దశి తర్వాతి రోజు వచ్చే దీపాల పండుగే దీపావళి. మహాలయ పక్షములో స్వర్గం నుంచి దిగివచ్చి భూలోకంలో తిరిగే పితృ దేవతలు ఈ రోజున పితృ లోకానికి  తిరిగి వెళతారని వారికి వెలుతురు చూపించడం కోసం అలా ఆరుబయట దీపాలు వెలిగించే ఆచారము ఉందని మరో పురాణ కథనం.


దీపావళి రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదము, లక్ష్మీ ప్రదము. దీపావళి పండగ రోజు ఉదయం దీపాన్ని దైవం దగ్గర, సంధ్యాదీపం మును ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించి భక్తితో నమస్కరించాలి. దీపావళి పండుగ రోజు ఉదయము ఐదు గంటలకు నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దేవుని దీపారాధన చేయాలి. అలాగే  సాయంత్రం కూడా తల స్నానం చేసే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి పూజలో ముఖ్యముగా వినాయకుని, లక్ష్మీదేవిని పూజించాలి ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తారురో, వారి ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: