పండగా అనగా పవిత్రతకు మూలమైన రోజు. ఇకపోతే ప్రతి పర్వదినాన చక్కగా తలంటూ స్నానం చేసి, నియమనిష్టలతో భగవంతున్ని సేవించి ఆయన ఆశీస్సులు పొందాలి. కాని ఇందులో చిన్న కిటుకు వుంది.అభిమానం, అహంకారంతో పూజలు చేసే వారికంటే బంధనాలలో ఉన్నప్పటికీ మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను స్మరిస్తూ ఆయన చెప్పిన విధంగా నడిచేవారే నిజంగా స్వర్గానికి వెళతారు. అంతే గాని ఆర్బాటాలకోసమో, లేక తమ పరపతిని నలుగురికి చూపించడం కోసమో చేసే పూజ పూజనే కాదు.


ఇలా పూజించడం వల్ల నలుగురిలో భక్తుడిగా కీర్తించబడుతారేమో గాని అంతర్గతంగా నీలో ఆత్మ రూపంలో ఉన్న ఆ పరమాత్మ మాత్రం ఇలా నటించే వారిని క్షమించడు. ఇంతే కాకుండా మనం చేసే ప్రతి కర్మకాండకీ, ఆచారాలకు ఎంతో అంతరార్థం ఉంది. వాటిని తెలుసుకొని సక్రమంగా ఆచరించిన 21 జన్మల స్వర్గప్రాప్తిని పొందగలరని మన వేదాలు చెబుతున్నాయి.. ఇకపోతే దీపావళి అంటే పరంజ్యోతి అయిన శివపరమాత్మ సృష్టిపై అవతరించిన దానికి గుర్తు. శ్రీకృష్ణుడు అంటే నిరాకార శివపరమాత్మ, సత్యభామ అంటే సత్యమైన భావాలు కలిగిన మానవులు (ఆత్మలు) నరకాసురుడు అనగా నరుల్లో అసుర గుణాలు ప్రవేశించుట. ఇల్లు అంటే శరీరం. దీపం అంటే ఆత్మ అని అరం.


ఈ కలియుగంలో ప్రతి ఒక్కరిలో కామ, క్రోధలనే అసుర గుణాలు ప్రవేశించిన కారణంగా ఒకరికొకరు దుఃఖన్నిచ్చుకుంటూ అజ్ఞానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పరంజ్యోతి అయిన శివపరమాత్మ వచ్చి కన్యలు, మాతల తలపై జ్ఞాన కలశాన్ని పెట్టి విశ్వకళ్యాణ బాధ్యతను వారికి అప్పగిస్తారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని అసుర గుణాలను తొలగించుకుంటారో వారిలో అజ్ఞానం దూరమై స్వర్గ సుఖాలను పొందుతారు. 


ఇకపోతే పరమాత్మ ప్రతి కల్పం చివరిలో 5000 సంవత్సరాలకు ఒకసారి సృష్టిపై అవతరించే సమయాన్ని పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. ఈ కల్పం అంటే  సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలను కలిపి కల్పమంటారు. ఇక ఎవరైతె కామ, క్రోద, మోహ, మదమత్సరాలను తొలగించుకుని సంపూర్ణంగా పవిత్రులు గావించబడుతారో వారు మాత్రమే పరమాత్మను చేరుకోగలని పురాణాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: