లోకంలోమంచి చెడులున్నట్లే మనుష్యుల్లో రకరకాలుగా ఉంటారు. ఇక మనుష్య బుద్దిలోని రంగులు చెప్పమంటే అవి ఊహకందనంతగా ఉంటాయి. కాని ధర్మాన్ని అనుసరించి ఆలోచిస్తే మనుష్యులు నాలుగు రకాలుగా ఉంటారట. వారిని క్షుణంగా గమనిస్తే. చీకటిలో నుండి చీకటిలోనికి ప్రయాణించేవారు. వెలుగు నుండి చీకటిలోనికి ప్రయాణించేవారు. మరోరకం వారు ఇలా ఉంటారు. చీకటిలో నుండి వెలుగులోనికి ప్రయాణించేవారు. వెలుగు నుండి వెలుగులోనికి ప్రయాణించేవారు. ఇకపోతే మొదటి రకంలో ఉన్నవారు అజ్ఞానులు వారు మారరు.


రెండవ రకంలో ఉన్నవారు మూర్ఖులు, వారికి ఏం తోచదు చెబితే వినరు, మారదలుచుకోరు. అంతేగాకుండా మూడవరకం వారు జిజ్ఞాసులు ప్రయత్నించి ఏదైనా పొందుదామని అనుకునేవారు. ఇక నాల్గవరకం జ్ఞానులు, జ్ఞాన మార్గమే వారి ధ్యేయంగా జీవిస్తారు. ఇకపోతే భక్తి అంటే కళ్లుమూసుకుని ప్రార్ధించే ప్రతివారు కారు నిజమైన భక్తులు.  వారిలో కూడా నాలుగు రకాలుగా ఉన్నారు. వారిని ఓ సారి గమనిస్తే ఆర్తులు ( కష్టాలలో ఉన్నవారు ). అర్థార్తులు ( ఏదైనా ఆశించేవారు ). జిజ్ఞాసులు ( తెలుసుకోదలచిన వారు ). జ్ఞానులు (అన్ని తెలిసిన వారు) ఇందులో జ్ఞానులు మాత్రమే ఆత్మ నివేదనం అనే సొపానానికి  చేరుకున్నవారు.


జిజ్ఞాసులు అటువైపు అడుగులు వేస్తున్నవారు. ఆర్తులు, అర్ధార్తులు ఐహిక విషయములలోనే మునిగి ఉండేవారు. ఇకపోతే ఇలాంటి నవవిధ భక్తి సోపానాలను అధిరోహించి తమ జీవితాలను చరితార్థం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. వారి బాటలో నడవడానికి ఈ నాటి మనుష్యులు ప్రయత్నిస్తే ఈ రకమైన హింస ప్రపంచంలో ఉండనే ఉండదు. ఒక మనిషి మాయను చేధించాలంటే అది ఒక మహత్తరమైన కార్యముకాబట్టి, ఈ కార్యాన్ని సాధించాలంటే సాధకుడు నిత్యము మండుతున్న అగ్నిహోత్రం వలే భగవంతుని ధ్యాసలో లీనమై తననుతాను భగవన్నామస్మరణం అనే చితిలో కాలుతుండవలే. అలాంటి సమయంలో తనలోని చెడుకర్మలు ఆ భగవంతుడు అనే అగ్నికి ఆహూతి అయినప్పుడు  అతడు పరిపూర్ణుడుగా పిలవబడతాడు... 

మరింత సమాచారం తెలుసుకోండి: