దీపావళి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనెను తలకు, శరీరానికి, పట్టించి అభ్యంగన స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల్లోపూ అభ్యంగన స్నానం చేసేయాలని పండితులు చెప్తున్నారు. తలంటు స్నానం కోసం వేడినీటిని ఉపయోగించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.


దీపావళి రోజున ఉదయం చేసే అభ్యంగన స్నానాన్ని పవిత్ర గంగాస్నానంతో పోల్చుతారు. ఆరోజున ఇంటి బావి వద్ద లేదా నదుల వద్ద స్నానం చేయడం ద్వారా పవిత్ర గంగలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.


వికారినామ సంవత్సరం 27 అక్టోబర్ 2019, ఆదివారం పూట, చతుర్థి తిథి, చిత్త నక్షత్రంతో కూడిన శుభ దినానఉదయం 4.30 గంటల నుంచి 6.00 గంటల్లో తైల స్నానం, అభ్యంగన స్నానం చేసేందుకు సమయం ఉత్తమంగా వుందని పండితులు చెప్తున్నారు.


అలాగే ఉదయం 7.00 గంటలకు పైగా 8 గంటల్లోపు శుక్ర హోరలో దీపావళి పండుగకు సంబంధించిన పూజను చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదే రోజున సర్వ అమావాస్య కేదార గౌరీ వ్రత పూజను సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు గురు హోరలో లక్ష్మీ కుబేర పూజను చేయడం ఉత్తమ ఫలితాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: