దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ నిర్వహించడం చాలా చోట్ల ఒక ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, బొమ్మను కానీ పూజిస్తారు.ఇంతకూ లక్ష్మీదేవి అలా ఉంటుందని ఊహించి, అంత అద్భుతంగా గీసింది ఎవరు?రాజా రవివర్మ దీనిని చిత్రించాడని చరిత్రకారులు చెబుతారు. అనేక మంది హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలను ఆయనే చిత్రించాడని భావిస్తున్నారు.రాజా రవివర్మ గీసిన లక్ష్మీదేవి అసలు పెయింటింగ్ ఇంకా వదోదరలోని లక్ష్మీవిలాస్ రాజమందిరంలోని దర్బార్ హాలులో ఇప్పటికీ ఉంది.

వదోదరలోని ఫతేసింగ్ మ్యూజియం చరిత్రకారుడు, క్యూరేటర్ మందా హింగోరావ్.. ఈ చిత్రాన్ని రవివర్మ 1891లో గీశారని తెలిపారు.''లక్ష్మీదేవి, సరస్వతీ దేవి చిత్రాలతో రవివర్మ చాలా ప్రఖ్యాతి చెందారు. దీనిని ఆయన అప్పట్లో వదోదర రాష్ట్రాన్ని పాలించే మూడవ సాయాజీ రావు గైక్వాడ్ కోసం చిత్రించారు''''రవివర్మ తన చుట్టూ ఉన్నవారి ముఖాల నుంచి ప్రేరణ పొంది హిందూ దేవతల బొమ్మలను చిత్రించేవారు. ఆయన చిత్రించిన లక్ష్మీదేవి బొమ్మనే తర్వాత ముద్రణలోకి మార్చారు. దాంతో లక్ష్మీదేవి దేశంలోని ప్రతి ఇంటిలో కొలువుతీరింది''.లక్ష్మీదేవి చిత్రాన్ని రవివర్మ దర్బార్ హాలులో చిత్రించారని హింగోరావు తెలిపారు.

అక్కడ ఇంకా ఇతర లక్ష్మీదేవి పెయింటింగ్‌లు ఉన్నా, వాటిలో రవివర్మ పెయింటింగ్‌లో మాత్రమే జీవకళ ఉట్టిపడుతోంది. లక్ష్మీదేవికి ఆయన మానవ రూపాన్ని ఇచ్చారు.
దర్బార్ హాలులో ఉన్న రవివర్మ చిత్రంలో లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు కనిపిస్తాయి. అయితే ముద్రణలో మాత్రం ఒకటే కనిపిస్తుంది.రవివర్మకు మరాఠీ సంస్కృతితో చాలా అనుబంధం ఉంది. ఆయన చిత్రాలలో అది ప్రతిఫలిస్తుంది.''వదోదరలో ఉన్నప్పుడు  రవివర్మ సాయాజీ రావు కోరిక మేరకు అనేక బొమ్మలను చిత్రించారు. వాటిలో ఈ లక్ష్మీదేవి చిత్రం ఒకటి'' అని ప్రొఫెసర్ రతన్ తెలిపారు.ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉండే ఒక ప్రింటింగ్ ప్రెస్ మొదట రవివర్మ చిత్రించిన లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించడం ప్రారంభించింది

.రవివర్మ జీవితం చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆయన జీవితం ఆధారంగా తీసిన ఒక చిత్రం కూడా వివాదాస్పదమైంది.'రంగ్‌రసియా' చిత్రంలో రవివర్మను సుగంధ ప్రియుడిగా చూపించారు. సుగంధపై ప్రేమతోనే ఆయన తన పెయింటింగ్స్‌లో ఆమె ముఖాన్నే చిత్రించాడని అంటారు.రవివర్మ చిత్రించాడని చెబుతున్న అనేక దిగంబర పెయింటింగ్స్ విషయంలో కూడా చాలా వివాదం ఉంది. వాటిలో చాలా పెయింటింగ్స్ మతానికి సంబంధినవి. ఆ కారణంగా ఆయనపై ఒక కేసు కూడా నమోదైంది.ఏదేమైనా.. రవివర్మ పెయింటింగ్స్ దేవుళ్ల రూపాలు ప్రాచుర్యం చెందడానికి ఉపయోగపడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: